పాన్ ఇండియా సినిమా... స్టార్ హీరో సినిమా చేస్తే అది తమిళ్ అయినా తెలుగు అయినా సరే పాన్ ఇండియా సినిమా అనే ఆలోచన మినహా మరో ఆలోచన అనేది స్టార్ హీరోలకు అసలు రావడం లేదు అనే చెప్పాలి. సినిమాలు కాసుల వర్షం కురిపించే అవకాశాలు ఉన్న నేపధ్యంలో పాన్ ఇండియా సినిమాలనే ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా ఇప్పుడు రెండు భాషల్లో అర్ధమవుతుంది. ఇక మలయాళం కన్నడం మినహా ఈ రెండు భాషలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేసాయి అని చెప్పాలి. 

 

ఇప్పుడు అసలు విషయానికి వచ్చి ఒకసారి చూస్తే పాన్ ఇండియా సినిమాల కారణంగా స్టార్ హీరోలు ఇప్పుడు చాలా వరకు నష్టపోయారు అనే వార్తలు వస్తున్నాయి. అవును ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరో గా ఎన్టీఆర్ అవ్వాలి అని చూసి రెండేళ్ళ పాటు రాజమౌళి కి సమయం ఇచ్చాడు. ధ్రువ సినిమా తో పాన్ ఇండియా  హీరో గా మారిన రామ్ చరణ్ కూడా అలాగే ఇప్పుడు రాజమౌళి చేతిలో బుక్ అయిపోయాడు. అదే విధంగా మహేష్ బాబు కూడా సరిలేరు నీకెవ్వరు సినిమాను పాన్ ఇండియా అని భావించి ఎలాగో ఒక కథను తీసాడు గాని అది జనాలకు సరిగా నచ్చలేదు. 

 

ఇక ఎన్టీఆర్ సినిమాలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా వైపు ఉంటున్నాయి ని అంటున్నారు. ఇక ప్రభాస్ రూట్ కాస్త వేరే. బాబు ఏ సినిమా చేసినా సరే కనీసం విడుదల చేయడానికి రెండు నుంచి మూడేళ్ళ పాటు పట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఇదే హీరోలను పూర్తిగా ముంచింది. ఈ సినిమాల కోసం మంచి కథలు ఉన్న సినిమాలను చేయడం లేదు అని కాస్త అసహనంగా ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: