టాలీవుడ్ లో స్టార్ హీరోల్లో వెంకటేష్ గురించి చాలా చెప్పవచ్చు. ఆయన సినిమాలు ఆయన నటన గురించి అందరికి తెలిసిన విషయమే. ఆయన ఒక సినిమా చేస్తున్నాడు అంటే దానికి ఒక రేంజ్ అనేది ఉంటుంది అనే సంగతి స్పష్టంగా అందరికి తెలుసు. సినిమా కథ విషయంలో ఆయన తీసుకునే జాగ్రత్తల నుంచి సినిమా విడుదల వరకు ప్రతీ విషయం కూడా ఆయన చాలా వరకు జాగ్రతగా చూస్తూ విడుదల చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన నారప్ప సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. 

 

ఈ సినిమాలో వెంకటేష్ ముగ్గురు పిల్లలకు తండ్రిగా ప్రియమణి కి భర్తగా నటిస్తున్నారు. ఈ సినిమా కథ విషయంలో  ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ముందుకి తీసుకుని వెళ్ళారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త ఏంటీ అంటే ఆయన ఒక సినిమాను మరోసారి సంక్రాంతి సినిమాలా ఫ్యామిలీ సినిమా చెయ్యాలి అని భావిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా కథ విషయంలో ఇప్పటికే ఆయన ఒక దర్శకుడి తో మాట్లాడినట్లు కూడా టాలీవుడ్ లో టాక్ మరి. ఈ విషయం అతని అన్న సురేష్ బాబు కి కూడా వెంకటేష్ చెప్పారు అని ఆయన కూడా కథ విని సినిమాకు ఓకే చెప్పారు అని టాక్. 

 

సినిమా వచ్చే ఏడాది ఎలా  అయినా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ సినిమాలో మీనా హీరోయిన్ గా చేసే అవకాశం ఉంది. వెంకటేష్ భార్యగా ఆమె చేసే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు మరి. ఈ సినిమా వస్తుందా లేదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి. ఈ సినిమాను వెంకటేష్ కూడా నిర్మించే అవకాశం ఉంది అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: