కరోనా గురించి చెప్పుకోవాలంటే ఒకటే మాట. ఇందుకల‌దు అందులేదు అన్న సందేహం వలదు అని.నిజంగా కరోనా ఎక్కడ ఉంది అంటే సర్వాంతర్యామి అని చెప్పాలి. పీల్చే గాలిలో.  నీటిలో, మనిషిలో, వస్తువులో, చూసే చూపులో ఇల్లా అంతటా తానేంటూ దేవుడి కంటే ఎక్కువగా విశ్వరూపం చూపిస్తూ భయపెట్టేస్తోంది. కరోనా తో చాలా ఇండస్ట్రీలు పూర్తిగా చితికిపోయాయి.

IHG

అటువంటి వాటిలో  ముందు వరసలో సినిమా రంగం ఉంది. సినిమా నటులు నాలుగు నెలలుగా ఇంట్లో కూర్చుని గోళ్ళు గిల్లుకుంటున్నారు. అదేదో సినిమాలో వెంకటేష్ పాత్ర పాడినట్లుగా పొద్దున అమెరికాలో, మధ్యాహ్నం  లండన్లో సాయంత్రం స్విట్జర్లాడ్ లో ఎక్కే విమానం దిగే విమానంతో హడావుడిగా బిజీగా గడిపే సినిమా నటులకు ఎంత పెద్ద బంగాళా లాంటి ఇంట్లో అయినా నాలుగు నెలల పాటు అన్నీ మూసుకుని ఉండమంటే చిక్కే మరి.

IHG

ఇక కరోనా లాక్ డౌన్ టైంలో కొంత కంట్రోల్ లో ఉంది. దాంతో సినిమా షూటింగులకు టాలీవుడ్ సినీ పెద్దలు అనుమతి అడిగారు. దాంతో అటు తెలంగాణా, ఇటు ఆంధ్రా ప్రభుత్వాలు మంజూరు చేశారు. ముందుగా బుల్లి తెర నటులు షూటింగులు మొదలెట్టారు. వారి మీద కరోనా ప్రభావం ఎంత ఉందో అని టెస్ట్ చేసి తరువాత బ్యాటింగుకి దిగుదామని సినిమా నటులు వెయిట్ చేశారు. 

IHG

టీవీ సీరియల్స్ షూటింగులు ఇలా మొదలయ్యాయో లేదో వరసగా కరోనా వారికి అంటుకుంది. దాంతో టీవీ షూటింగులు ఒక్కసారిగా ప్యాకప్ చెప్పేసి  వారు  ఇంట్లో కూర్చున్నారు. నిజానికి కరోనా కేసులు పెద్దగా  లేకుండా ఉంటే ఆగస్ట్ నుంచి షూటింగులకు దిగిపోవాలని పెద్ద బ్యానర్లు, టాప్ రేంజి హీరోలు ప్లాన్ చేసుకున్నారుట. ఇపుడు సీన్ చూస్తూంటే వ్యాక్సిన్ వస్తేనే తప్ప నో షూటింగ్ అనేస్తున్నారు. దాంతో ప్రెస్టేజియస్ మూవీస్ ఎన్నో ఇపుడు ఆగిపోయాయి. అవి ఎపుడు మొదలవుతాయి. ఎపుడు రిలీజ్ అవుతాయి అన్నది ఎవరికీ అంతుపట్టడంలేదు. మొత్తానికి టాలీవుడ్ కి కరోనా భారీ షాక్ ఇచ్చేసింది అని బాధ పడుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: