తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ చూసిన హీరోయిన్ త్రిష. స్టార్ హీరోలందరితో నటించిన ఈ చెన్నై చంద్రం సినీ కెరీర్ 17ఏళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతోంది. నేటి రోజుల్లో ఇటువంటి ఘనత సాధించిన అతికొద్దిమంది హీరోయిన్లలో త్రిష టాప్ త్రీలో ఉంటుంది. ప్రస్తుతం తమిళ సినిమాల్లో నటిస్తున్న త్రిష ఇప్పుడు వెబ్ సిరీస్ ల వైపు కూడా చూస్తోందని చెన్నై సమాచారం. ప్రస్తుతం వెబ్ సిరీస్ కాలం నడుస్తూండడంతో త్రిష కూడా అటువైపు అడుగులు వేస్తోందని అంటున్నారు.

IHG

 

త్రిష నటిస్తుందని ప్రచారం జరుగుతున్న వెబ్ సిరీస్ ఎమోషనల్ కంటెంట్ తో ఉంటుందని అంటున్నారు. తండ్రీ, కూతుళ్ల మధ్య ఉండే ప్రేమ, భావోద్వేగాలతో ఈ వెబ్ సిరీస్ ఉంటుందని అంటున్నారు. దాదాపు దశాబ్దం క్రితం త్రిష ఇదే తరహా సినిమా చేసింది. ప్రకాశ్ రాజ్ తండ్రి పాత్రలో నటించిన ఆ సినిమా ‘ఆకాశమంత’. ఆనంద్ వికటన్ సంస్థ నిర్మించబోయే ఈ వెబ్ సిరీస్ లో త్రిషతో పాటు మరో సీనియర్ స్టార్ హీరో నటించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ సమాచారం. ఈ వెబ్ సిరీస్ కు రామ్ సుబ్రమణ్యన్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఈ వార్తపై అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.

IHG

 

ప్రస్తుతం త్రిష తమిళ్ లో మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో నటిస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఆఖరి నిముషంలో తప్పుకుంది. ప్రస్తుతం రవితేజ హీరోగా నటించే ఓ సినిమాకు త్రిషను సంప్రదించినట్టు ఓ గాసిప్ కూడా రౌండ్ అవుతోంది. మొత్తానికి ఓటీటీల హవా నడుస్తున్న టైమ్ లో త్రిష కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ వైపు అడుగులేయడం విశేషం. ఇప్పటికే సమంత, తమన్నా.. వంటి స్టార్ హీరోయిన్లు వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: