మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతటా సంక్షోభం ఏర్పడింది. ఆర్థికంగా చాలా దేశాలు నష్టపోవడంతో పాటు చాలా రంగాలు క్లోజ్ అయిపోవడంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సినిమా థియేటర్లు క్లోజ్ అయిపోవటంతో చాలావరకూ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు చూపు వెబ్ సిరీస్ మీద పడటం జరిగింది. మొదటిలో వెబ్ సిరీస్ చాలా వరకు బాలీవుడ్ ఇండస్ట్రీ మరియు హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారు బాగా పెట్టుబడులు పెట్టి సినిమాలు నిర్మించి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో విడుదల చేసేవారు. అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ వారు కూడా మెల్లమెల్లగా వెబ్ సిరీస్ చేయటానికి ముందుకు వస్తున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్‌దేవ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంలో వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వస్తే మీరు ఏం చేస్తారు అనగానే ఒక్కసారిగా భయపడినట్లు ఆన్సర్ ఇచ్చాడట.

 

ఛాన్సే లేదు అసలు చెయ్యను…నా లాంటి హీరోలు వెబ్ సిరీస్ లో నటిస్తే కష్టమని తెలిపాడు. స్టార్ హీరోలు చేస్తే బానే ఉంటుంది కానీ నాలాంటి వాళ్ళు చేస్తే నష్టమే వస్తుందని పైగా ఎక్కువ మంది జడ్జ్ చేసే అవకాశం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. సినిమా ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాక కేవలం ఒకే ఒక్క సినిమా చేశాను… ఇలాంటి టైమ్ లో వెబ్ సిరీస్ లో సినిమా చేస్తే సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ సాధించలేక వెబ్ సిరీస్ చేస్తున్నాడేమో అనే నింద పడుతుందని కళ్యాణ్ దేవ్ చెప్పుకొచ్చాడు. 

 

ప్రస్తుతం చేస్తున్న రెండో సినిమా 'సూపర్ మచ్చి' లాక్ డౌన్ తర్వాత బ్యాలెన్స్ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసినట్లు తెలిపాడు. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నియమ నిబంధనలు పాటిస్తూ బ్యాలెన్స్ షూటింగ్ పూర్తిచేసినట్లు కళ్యాణ్ దేవ్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా అయిన వెంటనే శ్రీధర్ సీపాన దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: