థియేటర్లు మూతబడి ఇప్పటికి 100రోజులు దాటింది. సినిమా హాళ్లు ఎప్పటికి తెరుచుకుంటాయి అనేది ఇండస్ట్రీ జనాలకు తెలియడం లేదు. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న సినిమాలను హార్డ్ డిస్కుల్లో పెట్టి దాచుకోవాలా.. ఓటీటీలో రిలీజ్ చేయాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు నిర్మాతలు. నాని, సుధీర్ బాబు లీడ్ రోల్స్ లో ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన సినిమా వి. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ నానికి 25వ సినిమా. నేచురల్ స్టార్ కెరీర్ లో మెమరబుల్ గా నిలిచే ఈ సినిమాను మార్చ్ 25న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ థియేటర్లు మూతబడటంతో వి హార్డ్ డిస్కుల్లోనే ఉండిపోయింది. 

 

వి సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అల్లు అరవింద్ ఆహాతో వి నిర్మాత దిల్ రాజు డిస్కషన్స్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే నాని కెరీర్ లో మెమరబుల్ గా నిలిచే ఈ సిినిమాను థియేటర్ లో కాకుండా ఓటీటీలో రీలీజ్ చేస్తారా.. లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. 

 

అనుష్క చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా నిశ్శబ్ధం. హేమంత సుధాకర్ దర్శకత్వంలో మాధవన్, అనుష్క లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీ ఏప్రిల్ 2న రిలీజ్ కావాల్సింది. కానీ లాక్ డౌన్ తో బాక్స్ కే పరిమితమైంది. అయితే కొన్నాళ్ల క్రితం ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. అప్పుడు నిర్మాత కోనా వెంకట్ డైరెక్ట్ ఓటీటీ ఆలోచన లేదని చెప్పాడు. అయితే ఇప్పుడు మళ్లీ ఓటీటీ రిలీజ్ అనే టాక్ వస్తోంది. 

 

చాలా మంది నిర్మాతలు ఫైనాన్స్ తెచ్చే సినిమాలు తీస్తుంటారు. ఇలా అప్పు తెచ్చి సినిమాలు తీసిన నిర్మాతలకు సినిమా రిలీజ్ అయితేనే చేతికి డబ్బు అందుతుంది. ఇక సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ కు నోచుకోకపోతే ఆ అప్పుకి వడ్డీ పెరిగిపోతూనే ఉంటుంది. అందుకే వడ్డీలు మోయలేక బాలీవుడ్ బిగ్గీస్ కూడా ఓటీటీకి వెళ్లిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: