టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. ఒక్క టాలీవుడ్ లోనే కాదు టోటల్ సౌత్ అండ్ నార్త్ లో విజయ్ కి క్రేజ్ విపరీతంగా ఉంది. అందుకే ఈ యంగ్ హీరో టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని పూరి ఛార్మి కలిసి నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో నాలుగు భాషల్లో పూరి రూపొందిస్తున్నాడు. ఇప్పుడు ఈ క్రేజీ స్టార్ హీరోకి భారీ ఆఫర్ వచ్చినట్టు సమాచారం.

 

ఇండియాలో అతి పెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్'. హిందీతో పాటు తమిళంలోను ఈ రియాలిటీ షో కి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, కోలీవుడ్ లో కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ ఈ రియాలిటీ షోకి కళ్ళు తిరిగిపోయో రేంజ్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని బాలీవుడ్ మీడియా కథనాలు రాస్తున్నాయి. ఇక ఈ రియాలిటీ షో ని తెలుగులోను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 3 సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ కి తెలుగు ప్రేక్షకుల్లోను భారీ సినిమా రేంజ్ పాపులారిటి వచ్చింది. కొత్త సీజన్ మొదలవబోతున్న ప్రతీసారి ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంటుంది. 

 

ఇక త్వరలో మొదలవబోయో సీజన్ 4 లో ఇండస్ట్రీతో పాటు బుల్లితెర మీద పాపులారిటీని సాధించిన చాలా మంది ప్రముఖులను పార్టిసిపేట్ చేయించడానికి 'స్టార్ మా' సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఇప్పటికే బిగ్ బాస్ లో పాల్గొనే వాళ్ళ లిస్ట్ ఇదే అంటూ చాలా మంది సెలబ్రిటీస్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. సింగర్ గీతా మాధురి భర్త హీరో నందు - యాంకర్ ఝాన్సీ - బిత్తిరి సత్తి - అనసూయ - తరుణ్ - ఉప్పల్ బాలు ఇలా చాలా పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు బిత్తిరి సత్తి ఫైనల్ అని కూడా అంటున్నారు.

 

అయితే ఇంకా అఫీషియల్ గా మాత్రం లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో సస్పెన్స్ గా ఉంది. ఇక సీజన్ 4 కి హోస్ట్ గా ఎవరు ఉండబోతున్నారన్నది గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు ప్రేక్షకుల్లోనూ ఈ విషయంలో ఉత్కంఠత నెలకొంది. ఇందులో భాగంగానే ఈసారి కూడా నాగార్జున హోస్ట్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి.  అయితే తాజాగా స్టార్ మా బృందం టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ని కలిసినట్టు .. సీజన్ 4 కి హోస్ట్ గా భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.  

 

మరి ఇందులో ఎంతవరకు వాస్తవమో తెలీదు గాని ఇదే నిజమై  విజయ్ గనక బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ చేయడనికి ఒప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటి వరకు నిర్వహించిన 3 సీజన్ లకంటే  పెద్ద హిట్ అవడం ఖాయమని చెప్పుకుంటున్నారు. మరి విజయ్ కి స్టార్ మా ఢీల్ ఒకే నా కాదా అన్నది అధికారకంగా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: