పూరి జగన్నాధ్ చాలాకాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో భారీ సక్సస్ ని అందుకున్నాడు. ఎప్పుడు కథలు కుప్పలుగా ఉండే పూరి ఏ కథ తో సినిమా తీసిన నిరాశనే మిగిల్చాయి. కాని తన మార్క్ మాస్ కథ తో పక్కా తెలంగాణా యాస లో హీరో పాత్ర ఆ పాత్ర తో చెప్పించిన డైలాగ్స్ కి జనాలు ఫిదా అయిపోయారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజైనప్పుడు కేవలం తెలంగాణ లో మాత్రమే సక్సస్ అవుతుంది తప్ప మిగతా ప్రాంతాలలో కష్టమన్న టాక్ వినిపించింది. కాని మార్నింగ్ షో నుండి సీన్ మారిపోయింది.

 

IHG

బొమ్మ పడ్డ ప్రతీ ప్రాంతం నుంచి హిట్ టాక్ వచ్చింది. అంతేకాదు భారీ స్థాయిలో వసూళ్ళని రాబట్టింది. గత సినిమాలతో ఆర్ధికంగా నష్టపోయిన పూరి కి ఇస్మార్ట్ శంకర్ కష్టాలు తీర్చి డబుల్ ఎనర్జీని ఇచ్చింది. దాంతో పూరి మళ్ళీ కం బ్యాక్ అయి టాలీవుడ్ యంగ్ అండ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రూపొందుతుంది. కిక్ బాక్సింగ్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

 

IHG

అయితే వరస ఫ్లాపుల్లో ఉన్న పూరి కి ఒకానొక సందర్భంలో హీరో దొరకక చాలా ఇబ్బందులు పడ్డాడట. ఫ్లాపుల్లో ఉన్న పూరి కథ చెప్పడానికి కనీసం టైం కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. అంతకుముందు పూరి సూపర్ హిట్స్ ఇచ్చిన హీరోలు ఫోన్ చేసిన స్పందించలేదట. ఎట్టకేలకి ఫ్లాపుల్లో ఉన్న పూరికి ఫ్లాపుల్లో ఉన్న రాం దొరికాడు. ఇద్దరు కలిసి ఇస్మార్ట్ శంకర్ తో తమ సత్తా ఏంటో చూపించారు. 

 

IHG

అయితే ఇక నుంచి పూరికి ఇలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ఒక పదునైన కత్తిని తయారు చేసుకుంటున్నాడు. ఆ కత్తే కొడుకు ఆకాష్ పూరి. ఇప్పటికే తనతో మెహబూబా అన్న సినిమాని తీసిన పూరి ప్రస్తుతం తన అసోసియోట్ ని అనిల్ పాడూరి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కొడుకుతో రొమాంటిక్ అన్న సినిమాని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ సాంగ్ టీజర్ యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి.

 

IHG's 'Romantic' unveiled | The <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NEWS' target='_blank' title='news-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>news</a> ...

అంతేకాదు ఈ రెండు సినిమాలతో అందరూ ఆకాష్ హీరో మెటీరియల్ అని మాస్ హీరోగా మంచి ఫేం ని సాధిస్తాడని ప్రశంసలు దక్కించుకున్నాడు. అందుకే రానున్న రోజుల్లో హీరోల వెంటపడే అవకాశం పూరి కి రాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: