సినిమా పరిశ్రమలో ఏదైనా ఒక సినిమా సూపర్ హిట్ కొట్టి అద్భుత విజయాన్ని అందుకుంది అనగానే, దానిని మించేలా తదుపరి రాబోయే సినిమాలు ఉండాలని సినిమా ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు. ఇక సినిమాలను విపరీతంగా ఇష్టపడే మన తెలుగు వారు అయితే ఏదైనా సినిమాపై ఆసక్తి పెంచుకుంటే, తప్పకుండా ఆ సినిమా గతంలోని రికార్డ్స్ అని తుడిచిపెట్టేస్తుందని బలంగా నమ్ముంతూ ఉంటారు. ఆ విధంగా ఇటీవల దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి రెండు భాగాలూ కూడా అత్యద్భుత విజయాలు అందుకోవడంతో పాటు ఒకదానిని మించేలా మరొకటి వందల కోట్ల కలెక్షన్ ని దక్కించుకున్నాయి. 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KGF' target='_blank' title='kgf- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>kgf</a> Chapter 2?

కాగా వాటిలో బాహుబలి 2 అయితే రూ.1800 కోట్ల పైచిలుకు కలెక్షన్ ని కొల్లగొట్టింది. ఇకపోతే ఈ సినిమా కలెక్షన్ ని అధిగమించగల సత్తా దేనికి ఉంది అనే దానిపై కొద్దిరోజులుగా పలు టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా చర్చలు మొదలయ్యాయి. ఇటీవల కన్నడ హీరో యాష్ నటించిన కెజిఎఫ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో, ప్రస్తుతం దానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న కెజిఎఫ్ చాప్టర్ 2, తప్పకుండా బాహుబలి 2 రికార్డ్స్ ని బద్దలుకొడుతుందని కొందరు అంటుంటే, మరికొందరేమో ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ కె అది సాధ్యం అంటూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వాదించుకుంటూ కుమ్ములాడుకుంటున్నారు. 

 

ఇప్పటికే ఈ రెండు సినిమాలు కూడా దాదాపుగా చాలావరకు షూటింగ్ ని పూర్తి చేసుకోవడం జరిగింది. కరోనా కారణంగా విధించబడ్డ లాక్ డౌన్ కు ముందు, కెజిఎఫ్ ని అక్టోబర్ లో, అలానే ఆర్ఆర్ఆర్ ని రాబోయే జనవరిలో రిలీజ్ చేస్తున్నట్లు ఆయా సినిమాల నిర్మాతలు ప్రకటించారు. మరి ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే రెండు సినిమాలు కూడా వాయిదా పడ్డా పడవచ్చు అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు. ఈ విధంగా ఇంకా షూటింగ్ పూర్తి కాకముందే ఈ రెండు సినిమాల ఫ్యాన్స్ మధ్య అప్పుడే ఈ కుమ్ములాటలు ఏంటో అర్ధం కావడం లేదని కొందరు సినిమా ప్రేక్షకులు అంటున్నారు....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: