చాలా అనుమానస్పద రీతిలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అయితే అతని చావుతో భారతదేశం ఇండస్ట్రీ మొత్తం దిగ్భ్రాంతి చెందింది. ఇక అతనిని బాలీవుడ్ లో తిక్కేశారని మనస్తాపంతో అతను తీవ్రంగా మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని నెటిజన్లతో పాటు అతని సన్నిహితులు చాలామంది ఆరోపిస్తున్నారు. అయితే అలా చనిపోయిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి దేశ సినీ అభిమానులు ఘనమైన నివాళులు తమదైన రీతిలో అర్పించారు.

 

సుశాంత్ సింగ్ నటించిన చివరి సినిమా 'బేచారా' ట్రైలర్ విడుదల కాగా దానిపై అతని మీద ఉన్న ప్రేమను మొత్తాన్ని అభిమానులు కుమ్మరించారు. సుశాంత్ బ్రతికి ఉన్నట్లయితే అతని సినిమా ట్రైలర్ ని ఎంతమంది చూసేవారో తెలియదు కానీ.. అతని మరణం తర్వాత వచ్చిన పబ్లిక్ సానుభూతి ద్వారా సుశాంత్ సినిమా కొత్త టైలర్ కోటాను కోట్ళ మంది చూస్తున్నారు. అంతే కాదు దానికి లైక్ మీద లైక్ లు కొట్టేశారు. ఒక్కరోజులోనే దాదాపు 21 మిలియన్ వ్యూస్ ను సంపాదించిన ట్రైలర్ కు 4.4 మిలియన్ల మంది లైక్ కొట్టారు. ఇక మార్వెల్ వారి 'అవెంజర్స్ ఎండ్ గేమ్ ట్రైలర్' 3.2 మిలియన్ల లైక్ లను సంపాదించి నిన్నటి వరకు మొదటి స్థానంలో ఉన్నది రెండో స్థానానికి పడిపోయింది.

 

సుశాంత్ పట్ల జనంలో ఎంత సానుభూతి ఉందనేది దీన్ని బట్టి స్పష్టమవుతోంది. సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఇలాగే చూస్తారని డిస్నీ హాట్ స్టార్ ఆశిస్తోంది. చిత్రాన్ని కేవలం సబ్ స్క్రైబర్స్ కి మాత్రమే కాకుండా ఫ్రీగా వీక్షించేందుకు హాట్ స్టార్ నెల 24 నుంచి స్ట్రీమ్ చేస్తుంది. చిత్రాన్ని వీక్షించడం ఫ్రీ కనుక చిత్రాన్ని మాములుగా కంటే పెద్ద సంఖ్యలో చూసే అవకాశం ఉంది. సినిమాకు నెగెటివ్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చే అవకాశం తక్కువే కనుక దిల్ బేచారా ఓటిటి రికార్డులు లాంటివి సాధించినా ఆశ్చర్యం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: