కరోనా మహమ్మారి కారణంగా మూడునెలలు షూటింగులు లేక టీవీ ఆర్టిస్టులతో పాటు, సినిమా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ మూడు నెలల కాలంలో టెలివిజన్ లో కొత్త ఎపిసోడ్ లు ప్రసారం అవలేదు. పాతవాటినే మళ్ళీ టెలిక్యాస్ట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకుల్లో అత్యంత ఆదరణ పొందిన జబర్దస్త్ కార్యక్రమం కూడా ఆగిపోయింది. లాక్డౌన్ స్టార్ట్ అయ్యాక ఒక రెండు వారాల పాటు అంతకు ముందు షూటింగ్ చేసిన ఎపిసోడ్లతో రన్ చేసారు.

 

 

ఆ తర్వాత మళ్ళీ అందరిలాగే పాతవాటినే రిపీట్ చేస్తూ వచ్చారు. అయితే ప్రభుత్వం షూటింగులకి అనుమతులు ఇచ్చిన కారణంగా టీవీ సీరియళ్ళ చిత్రీకరణ మొదలయింది. వాటితో పాటే జబర్దస్త్ ప్రోగ్రామ్ కూడా షూటింగ్ జరుపుకుంది. అలా మరో రెండు వారాల పాటు కొత్త ఎపిసోడ్లని రన్ చేసిన జబర్దస్త్ ఆగిపోయిందని అంటున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయాన జబర్దస్త్ లో ఒకానొక నటుడికి కరోనా సోకిందని, అందువల్లే కొత్తగా ఎలాంటి షూటింగ్ జరపట్లేదని సమాచారం.

 

 

అయితే ఆ నటుడు ఎవరనేది మాత్రం తెలియలేదు. అతనితో పాటు క్లోజ్ గా ప్రతీ ఒక్కరూ హోమ్ క్వారంటైన్ కి వెళ్ళిపోయారట. ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఇలాంటి సమయంలో చిత్రీకరణ జరిపితే మరింత ప్రమాదకరం అన్న ఉద్దేశ్యంతో మల్లెమాల టీం భావించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే చాలా సీరియళ్ళు కరోనా కారణంగా ఆగిపోయాయి. హరిక్రిష్ణ, ప్రభాకర్, నవ్యస్వామి, రవిక్రిష్ణ మొదలగు వారికి కరోనా సోకడంతో ఆయా సీరియళ్ళన్నీ ఆగిపోయాయి.

IHG

 

ఈ దెబ్బతో సినిమావాళ్ళు మరింతగా భయపడుతున్నారు. సీరియళ్ళకి తగిలిన కాటు కారణంగా సినిమాల షూటింగులని ఇప్పుడప్పుడే స్టార్ట్ చేసేలా లేరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: