టాప్ హీరోల అభిమానులు ఒక సంవత్సరం వారి అభిమాన హీరో నుండి సినిమా విడుదలకాకపోతేనే విపరీతంగా బెంగపడిపోతారు. అయితే ప్రభాస్ రకరకాల కారణాలతో తన సినిమాల మధ్య గ్యాప్ ను సంవత్సరం విడిచి సంవత్సరాన్ని కొనసాగిస్తున్న పరిస్థితులలో ప్రభాస్ ‘మిస్సింగ్ స్టార్’ గా మారాడా అంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రభాస్ కు కొత్త ట్యాగ్ ను క్రియేట్ చేయడంతో అభిమానులు తీవ్రంగా నిరుత్సాహ పడుతున్నారు.


వాస్తవానికి ప్రభాస్ అభిమానులు అతడిని డార్లింగ్ అని పిలుచుకుంటారు. అయితే ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు క్రియేట్ చేసిన ఈ మిస్సింగ్ స్టార్ ట్యాగ్ ను హైలెట్ చేస్తూ ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ రానున్న రోజులలో జోక్స్ వేసే ఆస్కారం ఉందని అతడి అభిమానులు టెన్షన్ పడుతున్నారు.


వాస్తవానికి ప్రభాస్ ఇలా మిస్సింగ్ స్టార్ గా పరిగణింపబడటానికి ఒక ఆసక్తికర కారణం ఉంది. 2013 లో ‘మిర్చి’ విడుదలైన తరువాత 2015 లో ‘బాహుబలి’ పార్ట్ 1 2017 లో ‘బాహుబలి 2’ 2019 లో ‘సాహో’ సినిమాలు విడుదల అయి ప్రతి సినిమాకు మధ్య ఒక సంవత్సరం ఒక సంవత్సరం గ్యాప్ తో సినిమాలు రావడంతో ప్రభాస్ నుండి సినిమాలు 2014, 2016, 2018 లో సినిమాలు ప్రభాస్ నుండి లేకపోవడంతో ప్రభాస్ ‘మిస్సింగ్’ స్టార్ గా మారిపోయాడు అంటూ ఆ మీడియా సంస్థ కథనం ప్రభాస్ అభిమానులకు మరిచిపోతున్న గాయాన్ని రేపిన్నట్లుగా ఉంది అని అభిమానులు బాధ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రభాస్ జిల్ రాథా కృష్ణల ‘రాధే శ్యామ్’ ప్రస్తుత పరిస్థితులలో ఈ సంవత్సరం తన షూట్ ను పూర్తి చేసుకోలేదు. దీనితో ఈ సంవత్సరం కూడ ప్రభాస్ నుండి సినిమా లేకుండానే గడిచిపోయి వచ్చే సంవత్సరం 2021లో మాత్రమే ధియేటర్లలో కనిపించబోతున్నాడు. ఆతరువాత నాగ్ అశ్విన్ ప్రభాస్మూవీ కూడ భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఆ మూవీ 2023 లోనే విడుదల అయ్యే ఆస్కారం ఉంది. ఈ పరిస్థితులు వల్ల నిజంగానే ప్రభాస్ పేరు ముందు మిస్సింగ్ స్టార్ ట్యాగ్ శాశ్విత స్థానం ఏర్పరుచుకున్నా ఆశ్చర్యం లేదు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: