మహేష్ నమ్రతల ముద్దుల కొడుకు గౌతమ్ ఇప్పటి వరకు కేవలం ఒక్క సినిమాలో మాత్రమే నటించినా అతడికి అనేకమంది అభిమానులు ఉన్నారు. మహేష్ అభిమానులు అయితే ప్రిన్స్ వారసుడుగా సూపర్ స్టార్ కృష్ణ మనవడుగా గౌతమ్ తన నటనా వారసత్వాన్ని కొనసాగించాలని అభిప్రాయపడుతున్నారు.


వాస్తవానికి మొదట్లో సినిమాలలో నటించే ఉద్దేశ్యం గౌతమ్ కు బాగా ఉన్నా ప్రస్తుతం గౌతమ్ కేవలం సినిమాల పైనే కాకుండా రకరకాల రంగాల పై ఆసక్తి కనపరుస్తున్న పరిస్థితులలో భవిష్యత్ లో గౌతమ్ ఏరంగంలో సెటిల్ అవుతాడో తనకు తెలియదు అంటూ ఆమధ్య మహేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రస్తుతం చదువు పై తప్ప మరే విషయంలోనూ గౌతమ్ దృష్టి పెద్దగా మళ్ళకుండా మహేష్ నమ్రత లు చాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


ప్రస్తుతం గౌతమ్ మహేష్ తో సమానంగా పొడవు విషయంలో పోటీపడుతున్నాడు. ఈమధ్య లాక్ డౌన్ సమయంలో నమ్రత షేర్ చేస్తున్న ఫోటోలలో గౌతమ్ లుక్ చాల గ్లామర్ గా కనిపిస్తున్న పరిస్థితులలో మహేష్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య నమ్రత గౌతమ్ కు సంబంధించిన ఒక లేటెస్ట్ ఫోటోను షేర్ చేస్తూ ‘మై  ఎలూసివ్ సన్’ అంటూ కామెంట్ చేసింది.


ఇప్పుడు నమ్రత గౌతమ్ పై చేసిన కామెంట్ కొద్దిసేపటికే వైరల్ కావడంతో మహేష్ అభిమానులు నమ్రత షేర్ చేసిన ‘ఎలూసివ్’ అన్న పదం పై అర్ధాలు వెతకడం మొదలు పెట్టారు. దీనికి ‘అంతుచిక్కని’ అన్నఅర్ధం తెలుగులో ఉండటంతో గౌతమ్ విషయంలో ప్రస్తుతం నమ్రతకు ఏవిషయాలు అంతు చిక్కడంలేదు అంటూ మహేష్ అభిమానులు జోక్ చేస్తున్నారు. అంతేకాదు మరికొందరైతే గౌతమ్ తన కెరియర్ విషయమై సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో నమ్రత ఇలా గౌతమ్ పై ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటుంది అని అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా నమ్రత షేర్ చేసిన గౌతమ్ పై కామెంట్ వెనుక అనేక అర్ధాలు దాగి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: