చిరంజీవి చిన్నల్లుడుగా ‘విజేత’ మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ మొదటి ప్రయత్నం విజయవంతం అవ్వకపోయినా మరొకసారి హీరోగా తన అదృష్టాన్ని ‘సూపర్ మచ్చి’ మూవీ ద్వారా పరీక్షించుకో బోతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యతిరేక పరిస్థితులలో కూడ ఈమూవీ షూటింగ్ ను కొనసాగిస్తూ మీడియాలో తన ఇమేజ్ పెంచుకోవడం కోసం వరసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.


మెగా కాంపౌండ్ సపోర్ట్ పై కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈయంగ్ హీరో చిరంజీవి పవన్ కళ్యాణ్ ల సూపర్ హిట్ సినిమాల పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. నేటితరం హీరోలలో ముఖ్యంగా మెగా యంగ్ హీరోలలో చిరంజీవి పవన్ ల కెరియర్ కు సంబంధించిన టాప్ బాక్స్ ఆఫీసు హిట్ మూవీలను ఎవరైనా రీమేక్ చేయాలనుకుంటే ఏహీరో బాగుంటాడు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.


అలాంటి సూపర్ హీరోల సినిమాలకు సంబంధించిన రీమేక్ లో ఏ హీరోకి అయినా ముఖ్యంగా మెగా యంగ్ హీరోలకు నటించకపోవడమే మంచిది అంటూ అభిప్రాయపడుతున్నాడు. తాను వ్యక్తిగతంగా అలాంటి రీమేక్ ల జోలికి వెళ్ళి లేనిసమస్యను సృష్టించుకొను అంటూ కామెంట్ చేసాడు. తన లేటెస్ట్ మూవీ ఓటీటీ పై విడుదల అవుతుందా అన్న అంశం పై స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితులలో ఏదైనా జరగవచ్చు అని కామెంట్ చేసాడు.


ఇక వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ తాను వెబ్ సిరీస్ లో నటించే సాహసం చేయనని దీనికి కారణం వెబ్ సిరీస్ లో నటించిన వెంటనే అవకాశాలు లేకపోవడంతో ఇలా వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు అంటూ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి కాబట్టి ప్రస్తుతానికి తాను వెబ్ సిరీస్ కు దూరం అని అంటున్నాడు. వీలైనంత వరకు సినిమాలతో ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తాను అని చెపుతున్న ఈ మెగా చిన్నల్లుడు కనీసం తన రెండవ ప్రయత్నంలో అయినా విజయం సాదిస్తాడో లేదో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: