బాలీవుడ్ కండలవీరుడ్ సల్మాన్ ఖాన్ ఏడాదికి ఒక్క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈద్ ని పురస్కరించుకుని తన సినిమాలని రిలీజ్ చేస్తూ ఉన్నాడు. అయితే గత కొన్నేళ్ళుగా ఇదే పద్దతిని కొనసాగిస్తున్న సల్మాన్ ఖాన్ కి కరోనా కారణంగా బ్రేక్ పడింది. కరోనా ఎఫెక్ట్ వల్ల సినిమా థియేటర్లు మూతబడిపోవడంతో ఈ ఏడాది తన సినిమా విడుదల కాలేదు. అయితే సల్మాన్ సినిమాలతో పాటు బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరించే విషయం అందరికీ తెలిసిందే.

 

టెలివిజన్ తెరపై అత్యంత ప్రజాదరణ పొందిన ఈ బిగ్ బాస్ హిందీ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకూ సల్మాన్ ఖానే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అయిన సల్మాన్ కి బిగ్ బాస్ ఒక్క ఎపిసోడ్ కి బాగానే చెప్పిస్తోంది. మొదట్లో ఒక్క ఎపిసోడ్ కి 2.5 కోట్లు తీసుకున్న సల్మాన్ దాన్ని పెంచుకుంటూ వచ్చాడు. గత ఏడాది జరిగిన 13వ సీజన్ కి ఒక్కో ఎపిసోడ్ 14కోట్ల పారితోషికం అందుకున్నాడు.

 

ఆ లెక్కన ఆ ఏడాది సల్మాన్ ఖాన్ అందుకున్న మొత్తం పారితోషికం 403 కోట్లు. ఒక రియాలిటీ షోకి అంతమొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్నది ఇండియా మొత్తంలో సల్మాన్ ఒక్కడే అయ్యుంటాడు. అయితే తాజాగా ఈ సంవత్సరం మళ్ళీ బిగ్ బాస్ 14వ సీజన్ స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ సారి సల్మాన్ ఖాన్ ఏకంగా ఒక్కో ఎపిసోడ్ కి 16 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. అయితే దానికి కారణం ఉందని అంటున్నారు. 

 

గత ఏడాది సక్సెస్ ఫుల్ గా రన్ అయిన కారణంగా బిగ్ బాస్ 14వ సీజన్ మరికొన్ని వారాలపాటు పొడిగించనున్నారట. అందువల్ల సల్మాన్ ఖాన తన రెమ్యునరేషన్ ని మరింత పెంచుతున్నాడని అంటున్నారు. అయితే ఈ విషయమై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కరోనా కారణంగా పరిస్థితులన్నీ అస్తవ్యస్థం కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. లాక్డౌన్ టైమ్ లో బిగ్ బాస్ సీజన్ ఈ సంవత్సరం ప్రసారం అవడం కష్టం అనుకున్నారు. కానీ ప్రభుత్వ షూటింగులకి అనుమతులు ఇచ్చిన కారణంగా ఈ షో టివీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: