‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత చేయబోయే సినిమాల విషయమై ఇప్పటికే జూనియర్ ఆలోచనలు చేస్తూ అనేకమంది దర్శకులతో సినిమా కథల విషయమై చర్చలు చేయడమే కాకుండా ఇప్పటికే జూనియర్ ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత చేయబోయే రెండు సినిమాల విషయమై స్పష్టమైన క్లారిటీతో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో రామ్ చరణ్ కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత తాను చేయబోయే సినిమాల విషయంలో ఒక క్లారిటీ రావడం కోసం చాలగట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.


వాస్తవానికి రామ్ చరణ్ తో సినిమాలు చేయడానికి చాలామంది ఆసక్తి కనపరుస్తున్నా రామ్ చరణ్ మాత్రం ఇప్పటి వరకు ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత తాను చేయబోయే మూవీ విషయమై ఎవరికీ స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు అని అంటున్నారు. రామ్ చరణ్ తో సినిమాలు తీసే దర్శకుల లిస్టులో త్రివిక్రమ్ సందీప్ రెడ్డి వంగ సురేందర్ రెడ్డిల పేర్లు గత కొద్దిరోజులుగా చాల గట్టిగా వినిపిస్తున్నాయి.


అయితే ఎవరు ఊహించని విధంగా ఒక యంగ్ డైరెక్టర్ పేరు ఇప్పుడు ఈ లిస్టులోకి రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. సతీష్ అనే ఒక యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ చరణ్ కు బాగా నచ్చడంతో ఇప్పుడు ఆ స్టోరీ లైన్ కు స్క్రిప్ట్ ను తయారుచేసే పనిలో సతీష్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో చరణ్ మనసును ఆకర్షించిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు అంటూ అన్వేషణలు జరుగుతున్నాయి.


అయితే చరణ్ మాత్రం ఆ డైరెక్టర్ వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితులలో చరణ్ ఎందుకు ఇంత రహస్యం పెడుతున్నాడు అంటూ చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. ప్రస్తుతం చరణ్ ‘ఆర్ ఆర్ ఆర్’ లో నటిస్తూ తాను నిర్మిస్తున్న ‘ఆచార్య’ మూవీ షూటింగ్ ను వేగంగా పూర్తి చేయించాలి అని ప్రయత్నాలు చేస్తున్నా కరోనా పరిస్థితులు అడ్డు తగులుతూ ఉండటంతో ‘ఆచార్య’ ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియని కన్ఫ్యూజన్ లో చరణ్ కూడ ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: