తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్న మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేపట్టిన రాజశేఖర్‌ రెడ్డి, తనను నమ్ముకున్న వారికోసం ఏదైనా చేసేవారు. అందుకే తనకు అత్యంత సన్నిహితుడైన సీసీ రెడ్డి కోసం ఓ సినిమాలో కూడా నటించారు. గిరిజనుల సమస్యల నేపథ్యంలో బ్రహ్మానంథం లీడ్‌ రోల్‌లో తెరకెక్కిన మూఖీ సినిమాలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పాత్రలో నటించాడు. అందుకు సంబంధించిన షూటింగ్ కూడా రాజశేఖర్ రెడ్డి క్యాంప్‌ ఆఫీస్‌లు గ్రీన్‌ మ్యాట్‌లో చిత్రీకరించారు.

 

సినిమా కోసం భారీగానే ఖర్చు చేశారు నిర్మాతలు వికారబాద్‌ అవుడుల్లో మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం దాదాపు 30 లక్షలతో అక్కడే గిరిజన గూడెం సెట్‌ కూడా వేశారు. గిరిజ సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి సమస్యలను తీర్చేందుకు ముఖ్యమంత్రి, కలెక్టర్ సహా, పూర్తి ప్రభుత్వ వ్యవస్థ కదిలి వచ్చే కథతో ఈ సినిమాను రూపొందించారు.

 

సినిమా షూటింగ్ అంతా పూర్తి అయినా రిలీజ్ కు నోచుకోలేదు. ఈ సినిమాను విసు ఫిలింస్‌ బ్యానర్‌ మీద సోనియా రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అరుణ్ ప్రసాద్ దర్శకుడు. సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో కమల్‌ హాసన్ హీరోగా తెరకెక్కిన పుష్పక విమానం సినిమా తరువాత పూర్తి స్థాయి కమర్షియల్ మూఖీ సినిమాగా తెరకెక్కిన సినిమా ఇదేకావటం విశేషం.

 

ఈ సినిమాలో బ్రహ్మానందం, రాజశేఖర్ రెడ్డి మథ్య కొన్ని ఆసక్తికర ఫన్నీ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఒక్క డైలాగ్‌ కూడా లేకుండానే రాజన్న రాజసాన్ని, బ్రహ్మా స్టైల్‌ కామెడీ టైమింగ్‌ను అద్భుతంగా చూపించినట్టుగా అప్పట్లో చిత్రయూనిట్ వెల్లడించారు. అయితే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా ఎందుకో ఈ సినిమా రిలీజ్‌కు నోచుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: