రాజకీయా నేతల బయోపిక్‌ లు ఘనవిజయం సాధించిన సందర్భాలు చాలా తక్కువ. అయితే అలాంటి రూల్స్‌ ను బ్రేక్‌ చేస్తూ వెండితెర మీద కాసుల పంట పండించిన కథ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర. రాజన్న ఎంతో మంది జీవితాల్లో భాగమయ్యాడు. తాను రూపొందించిన సంక్షేమ కార్యక్రమాల తో తెలుగు ప్రజల కుటుంబ సభ్యుడయ్యాడు. అందుకే రాజన్న సినిమా అంటే ప్రజలు నీరాజనం పట్టారు.

 

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి చేసిన మహోన్నత పాద యాత్ర నేపథ్యం లో తెరకెక్కించిన చిత్రం యాత్ర. ఆనందో బ్రహ్మా ఫేం మహీ వీ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో లెజెండరీ యాక్టర్‌ మమ్ముట్టీ రాజన్న పాత్ర లో నటించాడు. రాజశేఖర్‌ రాజకీయ నేపథ్యం తో పాటు ఆయన వ్యక్తిత్వం రాజకీయ ఎత్తుగడ, అధిష్టానం విషయంలో ఆయన వైఖరీ. ప్రజాసేవ విషయంలో ఆయన నిబద్ధత ఇలా ఎన్నో కోణాలను ఈ సినిమా తో చూపించారు.

 

రాజన్న చేసిన సంక్షేమ కార్యక్రమాల కు భీజం ఎక్కడ పడింది. పాదయాత్ర రాజన్న కు ఎదురైన అనుభవాలు, ఆయన్ను కదిలించిన ప్రజల కష్టాలు ఇలా ఎన్నో విషయాలను చాలా భాగ చూపించారు. అదే సమయంలో కమర్షియల్ ఫార్ములాను ఏ మాత్రం మిస్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం పాటలు. రాజన్న యాత్ర, యాత్రలో ఎదురైన అనుభవాలకు అక్షర రూపం ఇవ్వటంతో పాటు వాటిని అద్భుతమైన సంగీతంలో మనసుకు హత్తుకునేలా రూపొందించాడు.

 

మమ్ముట్టి నటన, మహీ వీ రాఘవ టేకింగ్‌. 70 ఎమ్ ఎమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ నిర్మాణ విలువలు ఇలా అన్ని కలిసి ఈ సినిమాను ఓ అద్భుతం అనేలా చేశాయి. గత ఎన్నికలకు ముందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర జగన్‌ గెలుపులో తన వంతు పాత్ర పోషించిందనటంలో ఏ మాత్రం అతిషయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: