కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి పెరిగిపోతున్న పరిస్థితులలో విడుదలకు సిద్ధమైన కొన్ని సినిమాల పరిస్థితి అగమ్యగోచారంగా ఉంది. ఈ లిస్టులో ‘వి’ ‘నిశబ్దం’  ‘ఉప్పెన’ ‘రెడ్’ లాంటి సినిమాలు ముందువరసలో ఉన్నాయి. ఇండస్ట్రీ వర్గాల వారు చేస్తున్న అంచనాల ప్రకారం ఈ నాలుగు సినిమాల పై సుమారు 200 కోట్ల పెట్టుబడి బ్లాక్ అయింది అని వార్తలు వస్తున్నాయి.  


ప్రస్తుత పరిస్థితులలో థియేటర్స్ తెరుచుకోవడానికి మరో నాలుగు నెలలు పట్టినా ఆశ్చర్యంలేదు అని అంటున్నారు. ఈమధ్యలో కొన్ని  ఓటీటీ సంస్థల నుండి ఆఫర్లు వచ్చినా వాటిని అంగీకరించే స్థితిలో ఈ మూవీ నిర్మాతలు లేరు. నిన్న మొన్నటివరకు ఆగస్టు సమయానికి థియేటర్లు తెరుచుకుంటాయని భావించినా ఇప్పడు ఆ పరిస్థితులు లేవు.


దీనితో దసరా సీజన్ కూడ మిస్ అయినట్లే అంటున్నారు ఒకవేళ దసరా టైమ్ కు థియేటర్స్ ఓపెన్ అయినా కేవలం ఒక నెలరోజుల పాటు డబ్బింగ్ సినిమాలు మాత్రమే విడుదల అవుతాయి అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ‘వి’ ఓటీటీ రిలీజ్ గురించి మరోసారి ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు మొదలయ్యాయి ఈ సినిమాకు సంబంధించి దిల్ రాజ్ కు ఈసారి టెంప్టింగ్ ఆఫర్ వచ్చిందని ఈమూవీకి ఎక్కువ బడ్జెట్ ఖర్చు అయిన పరిస్థితులలో వడ్డీల భారం భరించడంకన్నా ఈచిత్రాన్ని ఓటీటీ కి ఇచ్చేయడానికి దిల్ రాజ్ అవుతున్నాడు అంటూ మళ్ళీ గాసిప్పులు గుప్పు మంటున్నాయి.


అయితే ఈసారి అల్లు వారి ‘ఆహా’ నుంచి కూడ మంచి ఆఫర్ వచ్చిందని ఈ మధ్య కాలంలో ఒత్తిడి లపై విడుదల అవుతున్న సినిమాలు నిరాశ పరుస్తుండటం వాటికి స్టార్ వాల్యూ లేకపోవడం వల్ల ఓటీటీ రిలీజ్‌ ల విషయంలో నెగెటివ్ ఫీలింగ్‌తో ప్రేక్షకులు ఉన్నారు. ఈ ఆలోచన మార్చడానికి ‘వి’ లాంటి పెద్ద సినిమాను రిలీజ్  చేయడం ద్వారా ‘ఆహా’ కు భారీ క్రేజ్ తీసుకురావడానికి అరవింద్ ఈ ప్లాన్ వేశాడు అని అంటున్నారు. ఈ ప్లాన్ కు దిల్ రాజ్ ఎంతవరకు సహకరిస్తాడో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: