ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. హాలీవుడ్, బాలీవుడ్ ఇతర సినీ పరిశ్రమల్లో ప్రముఖులు మరణాలు కంటనీరు పెట్టిస్తున్నాయి.  తాజాగా 2015లో వచ్చిన ‘ది హేట్‌ఫుల్‌ ఎయిట్‌’ అనే చిత్రానికి బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డు సాధించిన ప్ర‌ముఖ హాలీవుడ్ మ్యూజిక్ కంపోజ‌ర్ ఎన్నియో మోరికోన్(91) అనారోగ్యంతో క‌న్నుమూశారు. నాలుగు వంద‌ల‌కి సినిమాల‌కి పైగా సౌండ్ ట్రాక్స్ ఇచ్చిన మోరికోన్ వెస్ట్ర‌న్ మ్యూజిక్‌తో ఎంత‌గానో అల‌రించారు.  నవంబర్‌ 10, 1928లో జన్మించిన ఈయన దాదాపు 500 చిత్రాలకు పైగా పనిచేశాడు.

IHG

గోల్డెన్‌ గ్లోబ్‌, గ్రామీ, బాఫ్తా సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. 1966లో సెర్గియో లియోన్ దర్శకత్వంలోవచ్చిన ‘ది గుడ్‌ అండ్‌ ది బ్యాడ్‌ ది అగ్లీ’ చిత్రానికి సంగీతం అందించాడు. ‘ది గుడ్‌ ది బ్యాడ్‌ ది అగ్లీ’, ‘ది మిషన్‌’, ‘వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ ది వెస్ట్‌’, ‘ది అన్‌టచబుల్స్‌’ వంటి సినిమాలకు మోరికోన్‌ అందించిన సౌండ్‌ ట్రాక్స్ ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఆస్కార్ అకాడ‌మీ ఆయ‌న‌కి 2007లో జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం అందించింది.

IHG

1928 నవంబర్‌ 10న రోమ్‌లో జన్మించిన‌ మోరికోన్ మృతి తీవ్ర విషాదాన్ని క‌లిగించింది. ఆయ‌న మృతికి క‌మ‌ల్ హాస‌న్ కూడా నివాళులు అర్పించారు.  ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఎందరో సంగీత దర్శకులకు మార్గదర్శకం చేశారు. ఆయన మరణం చిత్రసీమకు ఎనలేని లోటు అని హాలీవుడ్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన సినీ ప్రముఖులు  నివాళులు అర్పించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: