సోషల్ మీడియా కారణంగా లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయో నష్టాలు కూడ అదే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్లకు వింత వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. కొంత మందికి ఇబ్బందులు, అవమానాలు ఎదురవుతుండగా మరికొందరికి వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా అలాంటి పరిస్థితే ఓ నటికి ఎదురైంది.
బాలీవుడ్ నటి తిలోత్తమ షోమ్ కు సోషల్ మీడియా ద్వారా ఓ అభిమాని ఓ మేసేజ్ చేశాడు. `నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను నా జీవితాంతం మీకు తోడుగా ఉంటాను. నేను వర్జిన్, శాఖాహారిని కూడా కావాలంటే వర్జినిటీ టెస్ట్ చేసుకోండి, లై డిటెక్టర్ టెస్ట్ చేసుకోండి, బ్రైయిన్ మ్యాపింగ్ టెస్ట్ అయినా చేసుకోండి` అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో మేసేజ్ చేశాడు.
ఈ మెసేజ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టా పేజ్‌లో షేర్ చేసిన తిలోత్తమ ఇంట్రస్టింగ్ రిప్లై ఇచ్చింది. `ఈ వెజిటేరియన్ జోక్ ఎంటీ సోదరా..? అవసరం లేదు.. బైబై` అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది తిలోత్తమ. ఇప్పుడు ఈ మేసేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ మెసేజ్‌పై రియాక్ట్ అవుతున్నారు.