పెళ్లి చూపులు సినిమాతో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన యువ నటుడు ప్రియదర్శి పులికొండ. తొలి సినిమాతోనే తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న ఈ యంగ్‌ టాలెంటెడ్‌ స్టార్ తరువాత వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. కమెడియన్‌గా కొనసాగుతూనే మల్లేశం లాంటి సందేశాత్మక చిత్రాల్లో లీడ్‌ రోల్స్‌లోనూ నటించాడు ప్రియదర్శి. ఇటీవల పెళ్లి కూడా చేసుకున్న ఈ యువ నటుడు ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ కమెడియన్‌గా కొనసాగుతున్నాడు.

 

లాక్‌ డౌన్‌ కారణంగా ప్రియదర్శి కూడా ఇంటికే పరిమతయ్యాడు. దీంతో ఇంటికే పరిమితమైన ప్రియదర్శి తన పర్సనల్ మూమెంట్స్‌తో పాటు సినిమాల అప్‌డేట్స్‌ను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు, ఈనేపథ్యంతో ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు ఈ యువ నటుడు.

 

తన ఇంటి దండెం మీద ఓ మాస్క్‌తో పాటు బాక్సర్‌ వేలాడుతున్న ఫోటోను షేర్‌ చేసిన ప్రియదర్శి ఇప్పటి వరకు ఈ ఏడాదిలో రెగ్యులర్‌గా వాడుతున్న వస్తువులు అంటూ కామెంట్ చేశాడు. ప్రియదర్శి చేసిన ఈ ఫన్నీ కామెంట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#essentials #2020SoFar

A post shared by Priyadarshi (@preyadarshe) on

మరింత సమాచారం తెలుసుకోండి: