అక్షయ్ కుమార్ ను టార్గెట్ చేశారు నెటిజన్లు. ఒకరిని విమర్శించే ముందు నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకో.. ఆ తర్వాత మరొకరి గురించి మాట్లాడమని విమర్శిస్తున్నారు. ఇంతకీ అక్షయ్ ను నెటిజన్లు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు. అక్కీ భాయ్ చేసిన  తప్పేంటి ?

 

అక్షయ్ కుమార్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఖాన్స్ తో పోటీ పడి మరీ బాక్సాఫీస్ దగ్గర హంగామా చేస్తున్నాడు. నార్త్ లో టాప్ ఛైర్ ను అందుకునేందుకు టఫ్ ఫైట్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో ఒక రేంజ్ లో ఉన్న అక్షయ్ కుమార్.. తాను కూడా నెపోటిజం బాధితుడినే అని కామెంట్ చేశాడు. దీనిపైనే విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. 

 

అక్షయ్ కుమార్ ని ఫస్ట్.. ఫూల్ ఔర్ కాంటే సినిమారు హీరోగా తీసుకున్నారట. మ్యూజిక్ సిట్టింగ్స్, ఫోటో షూట్స్ కూడా జరిగాయట. అయితే ముహూర్తం షాట్ కి వెళ్లేసరికి అక్షయ్ ను తప్పించి.. అజయ్ దేవగణ్ ని హీరోగా తీసుకున్నారట. ఈ సినిమాతోన అజయ్ దేవగణ్ హీరోగా లాంచ్ అయ్యాడు. ఇక అజయ్ తండ్రి వీరు దేవగణ్ ఫేమస్ యాక్షన్ డైరెక్టర్. తండ్రి ఇమేజ్ తోనే తనను తప్పించి ఫూల్ ఔర్ కాంటేకి అజయ్ ని హీరోగా తీసుకున్నారన్నట్టు చెప్పాడు అక్షయ్. 

 

అక్షయ్ కుమార్ నెపోటిజం బాధితుడినని చెప్పగానే నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అక్షయ్ మీ ఇంట్లోనే వారసత్వం ఉంది. దాని గురించి కూడా మాట్లాడు అని కామెంట్ చేస్తున్నారు. అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా వారసత్వంతోనే సినిమాల్లోకి వచ్చింది. రాజేశ్ ఖన్నా, డింపుల్ కపాడియా వారసురాలిగా సినిమాల్లోకి వచ్చింది ట్వింకిల్ ఖన్నా. దీంతో మీ వైఫ్ గురించి కామెంట్ చేసి ఆ తర్వాత మిగతావాళ్ల గురించి మాట్లాడు అని అక్షయ్ ని ట్రోల్ చేస్తున్నారు. మరి వారసత్వం కార్డుతో సినిమాల్లోకి వచ్చి భార్య గురించి అక్షయ్ ఏం మాట్లాడతాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: