బాలీవుడ్ స్టార్ హీరో, ఎంఎస్ ధోని ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఆయన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువగా ఉందని.. గత కొంత కాలంగా తనకు సినిమా ఛాన్సులు రానివ్వకుండా కొంత మంది సినీ పెద్దలు అడ్డుకుంటున్నారని.. ఆ బాధతోనే డిప్రేషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారని పలువురు సహనటులు ఆరోపించారు. అయితే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. వ్యోమగామి కావాలన్న అంతిమ కలను సాకారం చేసుకోవడానికి పైలట్ కావడానికి సుశాంత్ శిక్షణ పొందాడు.

 

ఆత్మహత్య చేసుకున్న సమయంలో బ్లాక్ కలర్ నేషనల్ స్పేస్ యూనివర్సిటీకి చెందిన టీషర్ట్ ధరించినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే సుశాంత్ తీవ్రమైన ఒత్తిడిలో సహచరులు తెలిపారు. టీవీ స్ర్కీన్ నుంచి సిల్వర్ స్ర్కీన్ పైకి ప్రయాణాన్ని సాగించిన సుశాంత్ మంచి డ్యాన్సర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2017లో ఓ టీవీ రియాలిటీ షోలో సుశాంత్ షారుక్ తో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇక బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వీరాభిమాని అనే విషయం తెలిసిందే.

 

గత కొన్ని రోజులుగా సుశాంత్ కి సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.  ఛయ్య ఛయ్య  అంటూ సాగే సూపర్ హిట్ ట్రాక్ కు షారుక్, సుశాంత్ స్టేజీపై డ్యాన్స్ చేశారు. చాలా స్టైలిష్ గా సుశాంత్ డ్యాన్స్ చేస్తుంటే..పక్కనే ఉన్న ఫరాఖాన్, సానియామీర్జా వారిలో మరింత జోష్ నింపుతున్నారు. అయితే సుశాంత్ డ్యాన్స్ చూసి షారూక్ ఆశ్చర్యపోతూ కనిపించారు.  షారుక్ ఫ్యాన్స్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియో చూసి మంచి భవిష్యత్ ఉన్న నటుడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

SRK-Sushant 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

A post shared by SRK (@shahrukhkhan_photos) on

మరింత సమాచారం తెలుసుకోండి: