రెండేళ్ల క్రితం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సామెత సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆ తరువాత దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియోకు ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. 

IHG

కాగా ఈ సినిమా రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమా తరువాత మరొక్కసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని బ్యానర్స్ పై నిర్మితం కానున్న ఈ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్. కాగా మంచి పొలిటికల్ సెటైరికల్ మూవీ గా ఆకట్టుకునే యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచస్ అదిరిపోనున్నట్లు టాక్. 

 

ఇప్పటివరకు ఎక్కువగా ఫ్యామిలీ, యాక్షన్ సినిమాలకు మంచి పంచ్ డైలాగ్స్ రాసిన త్రివిక్రమ్, ఈ సినిమా ద్వారా అద్భుతమైన పొలిటికల్ సెటైర్ల తూటాలు పేల్చనున్నారని, ఇప్పటికే చాలా వరకు ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి అయ్యాయని, అన్ని కలిసివస్తే మంచి ముహూర్తం చూసి ఈ సినిమా అధికారిక పూజా కార్యక్రమాలు జరపాలని చూస్తున్నారట సినిమా యూనిట్. కాగా త్రివిక్రమ్ కాంబోలో మరొక్కసారి రానున్న ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో, రిలీజ్ తరువాత ఎటువంటి విజయం అందుకుంటుందో చూడాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: