దక్షిణాదిలో తొలిసారి కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ ఇలియానా. ఇప్పటి స్టార్ హీరోయిన్లు.. కాజల్, నయనతార వంటి వారు ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు కానీ.. పదేళ్ల క్రితమే కోటి రూపాయలు తీసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇలియానా. అంతటి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఇలియానా తెలుగులోనే అగ్ర కథానాయికగా కొనసాగింది. మిగిలిన హీరోయిన్లు తెలుగు, తమిళ్ భాషల్లో రాణిస్తే ఇలియానా ఒక్క తెలుగులోనే అంతటి స్టార్ ఇమేజ్ సాధించింది. తెలుగులో స్టార్ స్టేటస్ ఉన్న సమయంలోనే ఆమె బాలీవుడ్ అవకాశాల కోసం ముంబయి చెక్కేసింది.

IHG

 

దాదాపు ఏడేళ్ల తర్వాత ఆమె రవితేజ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో రీఎంట్రీ ఇచ్చింది. అన్నేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన 2కోట్లు పారితోషికం తీసుకుందని వార్తలు వచ్చాయి. కానీ.. ఇలియానాలో ఒకనాటి నాజూకూదనం లేకపోయింది. ఒళ్లు చేసి ఆ సినిమాలో కనిపించింది. దీంతో మళ్లీ సన్నబడటానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటివల తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టా అకౌంట్ లో తన వర్కౌట్లు, తన నాజూకు నడుమును సెల్పీలు తీస్తూ పోస్ట్ చేస్తోంది. ఈ ఫొటోల్లో ఇలియానా నాజూకుగానే తయారైందని అనిపిస్తోంది. కానీ.. గతంలోలా ఇల్లూ బేబీకి అవకాశాలు తలుపు తట్టట్లేనట్టుంది.

IHG

 

ఆమెను కన్సిడర్ చేస్తూ ఏ ఒక్క సినిమా ఆఫర్ వచ్చినట్లు వార్తలు లేవు. మరి నాజూకు తీగలా మళ్లీ తయారైన ఇలియానాను తెలుగు సినిమాల్లో అవకాశాలు పలకరిస్తాయా అంటే చూడాల్సిందే. ప్రస్తుతం తన ఫిట్ నెస్ తో పోస్ట్ చేసిన ఫొటో ఇప్పుడు వైరల్ అయింది. మరి ఈ స్లిమ్ నెస్ ను తెలుగు సినిమాల కోసమా.. బాలీవుడ్ అవకాశాల కోసమో తెలీదు కానీ.. మళ్లీ సినిమాల్లో రాణించాలనే ఈ వర్కౌట్లు చేస్తోందని తెలుస్తోంది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: