టాలీవుడ్ యువ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గత ఏడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక దాని తరువాత రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ అయిన రామ్ చరణ్, ఆ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, మరొక హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషిస్తున్నాడు. తొలిసారిగా ఈ ఇద్దరు మెగాహీరోల కలయికలో రానున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. 

IHG's Zanjeer trailer to be out this ...

మరోవైపు గతంలో రాజమౌళి తీసిన బాహుబలి రెండు భాగాలూ కూడా అద్భుత విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించడంతోఈ దీనిపై పలు ఇతర భాషల ప్రేక్షకుల్లో కూడా విపరీతంగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు బ్యాలన్స్ ఉన్న షూటింగ్ ని అతి త్వరలో సినిమా యూనిట్ చిత్రీకరించనుంది. ఇకపోతే ఈ సినిమా తరువాత రామ్ చరణ్ ఒక బాలీవుడ్ చేయనున్నారని ఇప్పటికే కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. 

 

గతంలో కొన్నేళ్ల క్రితం అపూర్వ లఖియా దర్శకత్వంలో బాలీవుడ్ లో జంజీర్ సినిమా చేసిన చరణ్, ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలవడంతో అక్కడ మలి ప్రయత్నాలు విరమించాడు. ఇక ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న ఆర్ఆర్ఆర్ భారీ రేంజ్ లో తెరకెక్కనుండడంతో దీనితో తప్పకుండా నార్త్ లో మంచి క్రేజ్ సంపాదించాలని చూస్తున్నాడు చరణ్. దాని తరువాత మెల్లగా ఒక్కొక్కటిగా బాలీవుడ్ సినిమాలు చేసి అక్కడ కూడా జండా పాతేయాలనేది ఆయన ఆలోచనట. మరి చరణ్ బాలీవుడ్ మూవీ ప్లానింగ్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో, ఏమేరకు అక్కడ సక్సెస్ లు అందుకుంటాడో తెలియాలి అంటే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: