బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరూ టాప్ సీక్రెట్ మెయిన్ టైన్ చేస్తున్నారు. టైటిల్ రివీల్ చేయకుండా.. హీరోయిన్ పేరు చెప్పకుండా మొత్తం రహస్యంగానే ఉంచుతున్నారు. టీజర్ తో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన బాలయ్య కాస్టింగ్ విషయంలో కూడా ఇలాగే ఉంటున్నాడు. ఇంతకీ  బాలయ్య సినిమాకు హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటున్నారో తెలుసా.. 

 

బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా టీజర్ రిలీజై  చాలా రోజులు అయింది. ఈ టీజర్ లో బాలయ్య పేల్చిన డైలాగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానుల్లో అంచనాలు కూాడా పెరిగిపోయాయి. సింహా, లెజెండ్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కూడా యాక్షన్ ఎంటర్ టైనర్ లా ఉంటుందనే టాక్ స్టార్ట్ అయింది. అయితే సిిినిమాపై అంచనాలు మొదలైనా.. హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. 

 

బాలకృష్ణకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ముంబయి నుంచి ఒక హీరోయిన్ ని తీసుకొస్తున్నారని, మరొక రోల్ కోసం స్టార్ హీరోయిన్ ను కాంటాక్ట్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ స్టార్ హీరోయిన్ ఎవరు, బాలీవుడ్  బ్యూటీ ఎవరు అనేది మాత్రం చెప్పడం లేదు. 

 

బాలకృష్ణ ఈ సినిమాలో రెండు వేరియేషన్స్ లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. అగోరా గా ఒక పాత్ర, రెగ్యులర్ మాస్ యాక్షన్ తో మరో పాత్ర పోషిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక లాక్ డౌన్ తో బ్రేకులోకి వెళ్లిపోయింది. వచ్చే ఏడాదిలో మళ్లీ ఈ మూవీ షూటింగ్ కు వెళ్లే అవకాశముంది. 

 

మొత్తానికి బాలయ్య ఇటు బోయపాటి శ్రీను సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. హీరోయిన్ల ఎవరో చెప్పకుండా దాస్తున్నారు. దీంతో ఆయన అభిమానుల్లో ఒకింత ఉత్కంఠ నెలకొంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: