ఎన్టీఆర్ బర్త్ డే నాడు ఆర్ఆర్ఆర్ టీజర్ వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూశారు. కరోనా కారణంగా రిలీజ్ చేయలేకపోయానన్నాడు రాజమౌళి. లాక్ డౌన్ ఎత్తివేసి నెల దాటింది. ఇంకా ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ కాలేదు. రామ్ చరణ్ అభిమానులను ఖుషీ చేయించిన జక్కన్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ ను ఎప్పుడు ఇంప్రెస్ చేస్తాడనేది ఆసక్తిగా ఉంది. అసలు ఎన్టీఆర్ టీజర్ ను ఎందుకు మర్చిపోయాడనే సందేహం నెలకొంది.  

 

లాక్ డౌన్ కారణంగా ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. ఈ కారణంగానే.. ఎన్టీఆర్ టీజర్ రాలేదని అందరూ సర్దుకుపోయారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా ఆ ఊసే లేదు. షూటింగ్స్ కు పర్మీషన్ ఇచ్చినా.. ఆర్ఆర్ఆర్ ట్రైల్ షూట్ పెయిల్ కావడంతో దర్శకుడు షూటింగ్ జోలికి పోలేదు. పోనీ..టీజర్ వర్క్ పూర్తి చేసి రిలీజ్ చేస్తారనుకుంటే.. ఆ ఊసే ఎత్తడం లేదు. 

 

ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో.. ఈ ఇద్దరు మహావీరులు కలిస్తే ఎలా ఉంటుందన్న ఊహాత్మక కథతో ఆర్ఆర్ఆర్ ను తీస్తున్నాడు రాజమౌళి. అల్లూరి టీజర్ లో రామ్ చరణ్ పోలీస్ గెటప్ లో కనిపించాడు. కొమురం భీమ్ టీజర్ లో ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తారా.. అనే ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ రిలీజ్ చేసిన రామ్ చరణ్ టీజర్ భీమ్ ఫర్ రామరాజు పేరుతో రిలీజ్ అయింది. చెర్రీ విడుదల చేయబోయే తారక్ టీజర్ సీతారామరాజు ఫర్ భీం పేరుతో.. రామ్ చరణ్ వాయిస్ తో విడుదల కానుంది.  

 

ఎన్టీఆర్ టీజర్ ఇప్పట్లో రిలీజ్ అయ్యేటట్టు కనిపించడం లేదు. ఈ మోస్ట్ ఎవేటింగ్ టీజర్ ను బయటపెట్టడానికి అకేషన్ కుదరడం లేదట. తారక్ బర్త్ డే కోసం మళ్లీ ఏడాది ఆగాలి. ఒక వేళ విడుదల చేస్తే.. ఆగస్ట్ 15న రిలీజ్ చేసే అవకాశముంది. రాజమౌళి నిర్మాతగా మారి డైరెక్ట్ చేసిన యమదొంగ ఆగస్ట్ 15న విడుదలైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: