బాలయ్య బాబు తో బోయపాటి ‘సింహ’ మరియు ‘లెజెండ్’ లాంటి రెండు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించటం అందరికీ తెలిసిందే. బాలయ్య కెరీర్లోనే భారీ స్థాయిలో కలెక్షన్ లు మరియు రికార్డులు సాధించిన సినిమాలుగా ఈ రెండు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా ఇటీవల బాలయ్య బాబు చేసిన సినిమాలు రూలర్, తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితానికి సంబంధించి రిలీజ్ అయిన రెండు బయోపిక్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడం అందరికీ తెలిసిందే. వరుసగా బాలయ్యబాబు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్న తరుణంలో బోయపాటి రంగంలోకి దిగి బాలయ్యతో సినిమా అన్ని అనౌన్స్ చేసి నందమూరి అభిమానులకు కాస్త ఊరట ఇచ్చారు.

IHG

దీంతో కచ్చితంగా బాలయ్య బాబు కి బోయపాటి అదిరిపోయే విషయం అందిస్తాడని ప్లాపుల్లో నుండి బయటకు తీసుకు రావటం గ్యారెంటీ అని నందమూరి అభిమానులు ప్రస్తుతం బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన చిన్నపాటి వీడియో సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన వీడియో నందమూరి అభిమానులను ఎంతగానో అలరించింది.

IHG

కాగా ఇప్పుడు బాలయ్య బాబు కి సరైన విధంగా విలన్ పాత్ర సినిమాలో ఉండటంతో బోయపాటి బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో సంజయ్ దత్ ని రంగంలోకి దింపుతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలయ్య కోసం రెండు విలన్ పాత్రలు బోయపాటి డిజైన్ చేశారట. వాటిలో ఒకటి ఇప్పటికే శ్రీకాంత్ విలన్ గా చేస్తున్నారని వార్తలు రాగా, మరొక విలన్ క్యారెక్టర్ లో సంజయ్ దత్ నీ బోయపాటి చూపించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: