ప్రభాస్ కెరియర్ ని మార్చేసిన సినిమా ‘బాహుబలి’. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రిలీజైన ఈ సినిమా ప్రభాస్ కి దేశ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఏర్పడే విధంగా 'బాహుబలి' బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ‘బాహుబలి’ సినిమా రాకముందు వరకూ ప్రభాస్ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల మార్కెట్ కలిగిన హీరోగా మాత్రమే గుర్తింపు ఉండేది. కానీ ఎప్పుడైతే బాహుబలి రిలీజ్ అయ్యిందో ప్రభాస్ దిశ దశ మారిపోయింది. అప్పటిదాకా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ఇంటర్నేషనల్ స్థాయికి వ్యాపించింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని రికార్డులను పగలగొట్టింది బాహుబలి.

IHG

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కి బాహుబలి సెంటిమెంట్ ని ఉపయోగిస్తున్నాడు. విషయం ఏమిటంటే రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ అయి దాదాపు కొన్ని నెలలు అయిపోయింది. అయినా గాని సినిమా కి సంబంధించి ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు ఈ సినిమా యూనిట్ పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. అయినా గాని ఈ సినిమా యూనిట్ నుండి పెద్దగా స్పందన రాలేదు.

IHG's first look to release on July 10 | Entertainment <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NEWS' target='_blank' title='news-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>news</a> ...

ఇలాంటి తరుణంలో ప్రభాస్ ‘బాహుబలి’ సినిమా రిలీజ్ అయిన డేట్ నీ సెంటిమెంట్ గా చేసుకుని రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు. జులై పదవ తారీకు 2015 వ సంవత్సరమున ‘బాహుబలి’ సినిమా రిలీజ్ అయి అదిరిపోయే విజయాన్ని సాధించింది. సరిగ్గా 5 సంవత్సరాలకు అదే డేట్ నాడు తన కొత్త సినిమా టీజర్ రిలీజ్ చేయబోతున్నాడు ప్రభాస్. మరి ప్రభాస్ కొత్త సినిమా టీజర్ ఎన్ని అద్భుతాలు చేస్తుందో చూడాలి. 

  

మరింత సమాచారం తెలుసుకోండి: