టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ముందుగా నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సీమసింహం సినిమా ద్వారా నటుడిగా తెరంగేట్రం చేసిన నటవిరాట్ రావుగోపాలరావు తనయుడు రావు రమేష్, ఆ తరువాత గమ్యం, కొత్తబంగారు లోకం సినిమాల్లోని తన పాత్రల ద్వారా మంచి పేరు దక్కించుకున్నారు. ఇక అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన రావు రమేష్, కొద్దికాలంలోనే టాలీవుడ్ లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నారు. 

IHG's next titled 'Srirastu Subhamastu' | Entertainment ...

ఇక ఇటీవల చాలా సినిమాల్లో తండ్రి పాత్రల్లో నటిస్తూ ముందుకు సాగుతున్న రావురమేష్, ఆ పాత్రలలో పరకాయ ప్రవేశం చేస్తున్నారు అనే చెప్పాలి. ముఖ్యంగా ఇటీవల అల్లు వారి అబ్బాయి శిరీష్ హీరోగా యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వచ్చిన శ్రీరస్తు శుభమస్తు సినిమాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి తండ్రిగా మంచి పాత్రలో నటించి మెప్పించారు రమేష్. ఒక మధ్యతరగతి తండ్రిగా కూతురికి ప్రేమానురాగాలు అందించడంతో పాటు ఆమె ఎటువంటి ఇబ్బందులు పడకుండా, తన ఇష్టాలను కూడా ప్రక్కనపెట్టి స్నేహితుడైన తణికెళ్లభరణి వద్దకు వెళ్లి ఎప్పటికప్పుడు కొంత డబ్బు అప్పు చేసి ఆమెకు సకల సౌకర్యాలు సమకూరుస్తూ ఉంటాడు. 

 

ఆపై ఒకానొక సమయంలో ఉన్నత స్థాయిలో ఉన్న స్నేహితుడు భరణి, తన కూతురిని కోడలిగా చేసుకుంటాను అనడం, ఆపై కూతురు ఒక మంచి ఇంటికి కోడలిగా వెళ్తోంది అని తండ్రి రమేష్ ఎంతో సంబరపడడం జరుగుతుంది. అయితే మధ్యలో ఆయన కూతురిని ప్రేమించిన హీరో అనుకుండా ఎంటర్ అవడం, కథ కొంత ఆసక్తికరంగా మారడం జరుగుతుంది. అయితే చివరిలో సరిగ్గా ఆమె పెళ్ళిలో తాళిబొట్టుకట్టడానికి కొన్ని క్షణాల ముందు హీరో తండ్రి వచ్చి తమ కొడుక్కి, రావు రమేష్ కూతురిని ఇవ్వమని అడగడం, అదే సమయంలో భరణి కలుగచేసుకుని సర్ది చెప్పడంతో, చివరికి కూతురు వేరొకడిని ఇష్టపడుతుంది అని తెలుసుకుని అతడికి ఇచ్చి పెళ్ళిచేయడానికి సిద్ధం అవుతాడు తండ్రి రమేష్. ఆ విధంగా కెరీర్ పరంగా రావు రమేష్ నటించిన తండ్రి పాత్రల్లో శ్రీరస్తు శుభమస్తులో ఆయన జీవం పోసిన తండ్రి పాత్ర కూడా ఎప్పటికీ నిలిచిపోతుంది.....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: