మూడు నెలలు గ్యాప్ తర్వాత బుల్లితెర మీద రియాలిటీ షోస్, సీరియల్స్ సందడి చేస్తున్నాయి. ఇప్పటికే జబర్దస్త్ షో మొదలవగా ఆ షోని చూసి మరికొన్ని షోలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇక ఇదిలాఉంటే కొద్దిపాటి గ్యాప్ తర్వాత ఈటివిలో ప్రముఖ కమెడియన్ చేస్తున్న ఆలితో సరదాగా షో కూడా మొదలైంది. రీ స్టార్ట్ కోసం ఓ క్రేజీ జోడీ అయితే బాగుంటుందని ప్లాన్ చేసిన నిర్వాహకులు అందుకోసం యూట్యూబ్ జోడీ సుధీర్, రష్మిలను గెస్టులుగా తీసుకొచ్చారు. కెమెరా ఆన్ చేస్తే చాలు రష్మి మీద ప్రేమ చూపించే సుధీర్ఎపిసోడ్ ప్రోమోలో కూడా ఆమె మీద అదే లవ్ ఎఫెక్షన్ చూపించాడు.

 

ఇదిలాఉంటే షోలో భాగంగా రష్మి ఆలిని కౌగిలించుకోవాలని అనుకుంది కాని ఆలి మాత్రం ఆమెకు దొరకకుండా వద్దుబాబోయ్ అంటూ దూరంగా వెళ్లాడు. అంతేకాదు రష్మి ఇచ్చే ముద్దులు సైతం అందుకోకుండా జస్ట్ తను ఇచ్చే ముద్దులకు బుగ్గ చూపించాడు అంతే. కరోనా జాగ్రత్తలు జాగ్రత్తగా పాటిస్తూనే షూటింగ్ నిరహిస్తున్నారని తెలుస్తుంది.

 

అయితే ఇప్పటికే సీరియల్ ఆర్టిస్టులలో కరోనా కలకలం సృష్టిస్తుంది. అంతేకాదు జబర్దస్త్ టీం లో కూడా ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని అనారు. అందుకే షో నడుస్తున్నా కేవలం సోషల్ డిస్టన్స్ మెయింటైన్ చేస్తూ షూటింగ్ లో పాల్గొనాలని చూస్తున్నారు. ఆలి కూడా ఆ జాగ్రత్తల్లో భాగంగానే రష్మికి దూరంగా వెళ్లాడు. సరదాగానే అయినా ఆలితో సరదాగా ప్రోమో ఆకట్టుకుంది. సుధీర్, రష్మిలు వచ్చారు కాబట్టి ఆలి షో సూపర్ హిట్ అన్నట్టే. గ్యాప్ ఇచ్చి క్రేజీ జోడీతో షో రీ స్టార్ట్ చేసిన ఆలి మళ్లీ వరుస సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కొనసాగించే ప్లాన్ చేస్తున్నాడు.        

మరింత సమాచారం తెలుసుకోండి: