టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఏదైనా సినిమాలో ఉన్నారు అంటే, ఆయన నటనను చూడాలి అని థియేటర్ కు వెళ్లే ప్రేక్షకులు కొందరు ఉన్నారు. ఆ విధంగా మొదటి నుండి తాను పోషిస్తున్న పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న ప్రకాష్ రాజ్, స్వతహాగా తెలుగు వ్యక్తి కానప్పటికీ కూడా మన భాష మీద ప్రేమతో మొదట్లో సీరియల్స్ లో, ఆపై సినిమాల్లో ప్రవేశించి నటుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. విలన్ గా చేయాలన్నా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయాలన్నా, సపోర్టింగ్ రోల్ చేయాలన్నా ప్రకాష్ రాజ్ ఆయా పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయి నటిస్తుంటారు. 

IHG

ఆ విధంగా కొన్నేళ్ల క్రితం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన నువ్వే నువ్వే సినిమాలో హీరోయిన్ శ్రియ తండ్రిగా నటించిన ప్రకాష్ రాజ్, అద్భుతమైన నటనను కనబరిచారు. ఎన్నో కోట్ల ఆస్థి ఉన్న వ్యక్తిగా మొదటి నుండి కూతురిపై అంతులేని ప్రేమను పెంచుకున్న ఒక తండ్రి, మొదటి నుండి ప్రతి చిన్న విషయన్ని తనతో షేర్ చేసుకునే అలవాటున్న కూతురు, ఒకానొక సమయంలో ఒక మధ్యతరగతి యువకుడిని ప్రేమించిన విషయాన్ని మాత్రం తన దగ్గర దాచిపెడుతుంది. 

 

ఆ తరువాత కొంత కాలానికి కూతురు ఒక మధ్యతరగతి యువకుడైన హీరో తరుణ్ ని ప్రేమించిదని తెలుసుకుని అతడి ఇంటికివెళ్ళి తన పరిస్థితి వారికి తెలిసేలా అదే రీతిన అతడి ఫ్యామిలీతో వ్యవహరించడం, ఆపై హీరో వైఖరి నచ్చక ఇబ్బందులు పడడం, అయినప్పటికీ కూడా కూతురు అతడినే ప్రేమిస్తూ ఉండడం తట్టుకోలేని తండ్రిగా ఎంతో మధనపడుతూ ఉంటాడు. ఇక చివరికి తనకు ప్రాణమైన కూతురి ప్రేమకంటే తనకు కావలసింది ఏమి లేదని భావించి ఆ యువకుడిని కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ విధంగా ఒక మంచి మనసున్న తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్, ఆయన కూతురిగా శ్రియల అనుబంధం తెరపై ఎంతో హృద్యంగా సాగుతుంది. మొత్తంగా ఆ సినిమాలో శ్రీయ తండ్రిగా ప్రకాష్ రాజ్ నటన అద్భుతః అనే చెప్పాలి...!!  

 

మరింత సమాచారం తెలుసుకోండి: