సినిమా పరిశ్రమలో ఎవరైనా ఒక నటుడు, లేదా నటి ఏదైనా ఒకవిధమైన క్యారెక్టర్స్ లో నటించి మంచి పేరు గడించినట్లైతే మెల్లగా వారికి రాబోయే రోజుల్లో కూడా ఎక్కువగా అటువంటి పాత్రలే వస్తూ ఉంటాయి. అలానే దాదాపుగా అందరూ కూడా వారినే తీసుకోవాలని భావిస్తుంటారు కూడా. ఆ విధంగా ఒక తరహా పాత్రలకు పెట్టింది పేరై, తమ సినిమా లైఫ్ లో అటువంటి పాత్రలను వరుసగా చేస్తూ ముందుకు సాగిన నటీనటులు సినిమా పరిశ్రమలో ఎందరో ఉన్నారు. కాగా ముందుగా తమిళ సినిమా పరిశ్రమకు గోకులతిల్ సీతాయ్ అనే తమిళ సినిమాలో అతి చిన్న పాత్రలో నటించిన నటుడు విజయ్ సేతుపతి, ఆ తరువాత నుండి మెల్లగా తన టాలెంట్ తో చిన్న పాత్రల్లో నటిస్తూ ముందుకు సాగాడు. ఆపై కొన్నాళ్ళకు క్యారెక్టర్ ఆరిస్ట్ గా మంచి పేరు దక్కించుకున్న విజయ్, అనంతరం హీరోగా మారి అక్కడక్కడా కొన్ని సినిమాలు కూడా చేయడం జరిగింది. 

IHG'Thalapathy64'! | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TAMIL' target='_blank' title='tamil-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>tamil</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='movie-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>movie</a> ...

ఇక ఇటీవల కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటిస్తూ ముందుకు సాగుతున్న విజయ్ సేతుపతికి తమిళ నాట మక్కళ్ సెల్వం అనే బిరుదు ఉంది. పాత్ర ఏదైనా సరే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసే విజయ్, ప్రస్తుతం ఇటు టాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఇప్పటికే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఉప్పెన సినిమాలో రాయనం అనే విలన్ పాత్రలో నటిస్తున్న విజయ్ సేతుపతి, మరోవైపు బన్నీ, సుకుమార్ ల పుష్ప లో విలన్ గా కూడా ఎంపికైనట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అలానే మహేష్ నటించనున్న సర్కారు వారి పాటలో కూడా ఆయన ఒక విలన్ గా నటించనున్నట్లు టాక్. 

 

వీటితో పాటు అతి త్వరలో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల కాంబోలో తెరకెక్కనున్న మూవీ లో కూడా విలన్ గా విజయ్ సేతుపతినే తీసుకోవాలని చూస్తున్నాడట దర్శకుడు హరీష్. ఈ విధంగా వరుస అవకాశాలు ఆయన తలుపు తట్టనున్నాయని, అయితే అందరూ ఆయనే కావాలంటే, ఆయన మాత్రం కాల్షీట్స్ ఎంతవరకు అడ్జస్ట్ చేయగలరు అనే వాదన వినపడుతోంది. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, రాబోయే రోజుల్లో విజయ్ సేతుపతి తెలుగు నాట విలన్ గా మంచి గుర్తింపు సంపాదించుకోవం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: