కొన్ని సినిమాల్లో హీరో పాత్రలకు ధీటుగా హీరోయిన్ల పాత్రలు ఉంటాయి. అవి ప్రేమకథలైతే హీరో హీరోయిన్ల తల్లిదండ్రుల పాత్రలు కొన్నిసార్లు శక్తివంతంగా ఉంటాయి. అలాంటి సినిమాల్లో తరుణ్శ్రియ నటించిన ‘నువ్వే నువ్వే’ సినిమా ఒకటి. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల ప్రేమకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో హీరోయిన్ గా శ్రియ తన తండ్రి ప్రకాశ్ రాజ్ మధ్య ఆప్యాయత కూడా అంతే శక్తివంతంగా ఉంటుంది. సినిమాలోని పాత్రలను అంత అందంగా చూపించారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించాడు. సినిమా ఆద్యంతం తరుణ్శ్రియ – ప్రకాశ్ రాజ్ మధ్యే నడుస్తుంది.

IHG

 

కూతురు పుట్టిన దగ్గర నుంచి తండ్రి ఎంత అపురూపంగా చూసుకుంటాడో.. ఎంత బాధ్యతగా ఉంటాడో ఈ సినిమాలో చూపిస్తాడు దర్శకుడు విజయ్ భాస్కర్. నిజానికి తండ్రి – కూతుళ్ల మధ్య ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అదే ఈ సినిమాలో మెయిన్ పాయింట్ గా తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి కూతురు అడిగింది కాదనకుండా సమకూర్చే పాత్రలో ప్రకాశ్ రాజ్ పాత్ర ఉంటుంది. కూతురు పెళ్లి చేసుకుని తనకు దూరమైపోతుందని బాధ పడుతూ ఉంటాడు ప్రకాశ్ రాజ్. కూతురు మనసుకు నచ్చిన వాడు కాకుండా తనకు ఇష్టమైన వ్యక్తే ఉండాలని చూసే తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటించాడు..

IHG

 

కన్న కూతురుపై తండ్రి ఎంత ప్రేమ వ్యక్తం చేస్తాడో చాలా హృద్యంగా తెరకెక్కించారు. ప్రతి ఫ్రేమ్ లో కూడా ప్రకాశ్ పాత్ర కాకుండా శ్రియ తండ్రి పాత్రే కనిపిస్తుంది. నటనలో ప్రకాశ్ రాజ్ జీవించడం వల్ల ప్రేక్షకులు కూడా సినిమాలో లీనమైపోయారు. నిజజీవితంలో తండ్రీ – కూతుళ్ల మధ్య ప్రేమ ఇలానే ఉండాలనేంతగా రెండు పాత్రలు ఆకట్టుకుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాకు ప్రకాశ్ రాజ్ పాత్ర ప్రాణం. అంతగా తన సహజమైన నటనతో మెప్పిస్తాడు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: