కన్నడ టీవి యాక్టర్ ,ఫిట్ నెస్ ట్రైనర్ సుశీల్ గౌడ (30) నిన్న సాయంత్రం బెంగుళూరు లోని మండ్యలో వున్న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఘటన పై విచారణ చేస్తున్నామని మండ్యఎస్పీ పరుశురామ్ వెల్లడించారు. కన్నడ సీరియల్ అంత:పుర ద్వారా సుశీల్ గౌడ గుర్తింపు తెచుకున్నాడు అటు సీరియళ్లలో నటిస్తూనే సుశీల్ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించేవాడు. అందులోభాగంగా ప్రముఖ హీరో దునియా విజయ్ తెరకెక్కిస్తున్నసలగలో సుశీల్ గౌడ కీలక పాత్రలో నటించాడు అయితే ఈసినిమా విడుదల కాకముందే సుశీల్ కన్నుమూశాడు. ఇకసుశీల్ మృతిపై దునియా విజయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశాడు. సలగలో పోలీస్ పాత్రలో సుశీల్ అద్భుతంగా నటించాడు కన్నడ ఇండస్ట్రీ లో అతను పెద్ద హీరో అవుతాడని అనుకున్నాను కానీ సుశీల్ ఇలా చేసుకుంటాడు అనుకోలేదని, సమస్యలకు చావే పరిష్కారం కాదని దునియా విజయ్ అన్నాడు. 
 
మరోవైపు చిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే వున్నాయి. ఇటీవల కన్నడ హీరో ,యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించాడు ఇది జరిగిన కొన్నిరోజులకే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (34) ముంబైలోని తన అపార్ట్మెంట్ లో వురి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇలా చేయడం కోట్ల మంది హృదయాలను కలిచివేసింది అయితే డిఫ్రెషన్ తోనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడి కాగా ఈకేసుపై ముంబై పోలీసులు ఇంకా లోతుగా విచారణ జరుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: