టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మంచి టైమింగ్ లో చిరంజీవి తరువాత నెంబర్ వన్ స్థానం లో ఉన్న పవన్ కళ్యాణ్ సడన్ గా పాలిటిక్స్ లోకి వెళ్లడం జరిగింది. 2014 వ సంవత్సరం లో జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్, ఆ టైం లో చంద్రబాబు కి మద్దతు తెలపడం జరిగింది. చంద్రబాబు గెలిచిన తరువాత ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క సినిమారంగంలో సినిమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ రాణించాడు. సరిగ్గా 2019 ఎన్నికల సంవత్సరానికి ముందు ఇంక సినిమాలు చేయను పూర్తిగా నా జీవితం రాజకీయాలకు అంకితమని అప్పటినుండి 2019 ఎన్నికల వరకు జనసేన పార్టీని గెలిపించడానికి తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ మొట్టమొదటిసారి రాజకీయాల్లో పోటీ చేయడం జరిగింది.

 

పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది. దీంతో అందరూ పవన్ కళ్యాణ్ ఇక రాజకీయాలు వదిలిపెట్టి సినిమాలకు వెళ్ళిపోతాడు భావించిన సమయంలో.. అందరికీ షాక్ ఇస్తే ఇక సినిమాలు చేసేది లేదు ఓడినా గెలిచిన ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు అంటూ భారీ డైలాగులు వేశారు.  ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ ఏడాది ప్రారంభంలోనే 'వకీల్ సాబ్' అనే సినిమా తో రీ ఎంట్రీ ఇస్తూ హరీష్ శంకర్ మరియు క్రిష్ సినిమా లను లైన్ లో పెట్టడం జరిగింది.

 

కాగా 'వకీల్ సాబ్' సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న టైములో కరోనా రావడంతో పవన్ కళ్యాణ్ పరిస్థితి అటు రాజకీయాలకు ఇటు సినిమా రంగానికి పూర్తిగా టైం కేటాయించలేని పరిస్థితి నెలకొంది. దీంతో పవన్ పరిస్థితి చూసి ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీ పెద్దలు పాపం అని అంటున్నారట. కరోనా దెబ్బ పవన్ కళ్యాణ్ కెరియర్ కి గట్టిగా ఎఫెక్ట్ ఇచ్చిందని కామెంట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: