'బాహుబలి' సినిమా తో అంతర్జాతీయస్థాయిలో తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ గా 'బాహుబలి' సినిమా తో మారిపోయిన ప్రభాస్ ఆ తర్వాత సినిమాలు చేయడం లో చాలా స్లో అయిపోయాడు. గతంలో 16 సంవత్సరాలలో 12 సినిమాలు చేసిన ప్రభాస్బాహుబలి సినిమా తర్వాత ఏడేళ్లలో మూడే సినిమాలు చేయడం జరిగింది. చాలావరకు ప్రభాస్ సినిమాలు చేయటంలో ఇది వారి కంటే స్లో అయిపోయాడని సొంత ఫ్యాన్స్ అంటున్నారు.

IHG

'బాహుబలి' తర్వాత చేసిన 'సాహో' సినిమా కి దాదాపు రెండు సంవత్సరాలు టైం చేసుకున్న ప్రభాస్… భారీ ఫ్లాప్ చూశాడు. దీంతో ప్రభాస్ అభిమానులు అనవసరంగా 'సాహో' సినిమా ప్రభాస్ చేశాడని టైం వేస్ట్ చేశాడని ఆ సమయంలో అనేక కామెంట్లు చేశారు. ఇదిలా ఉండగా రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా ఇంకా టైం పట్టే పరిస్థితి ఉండటంతో పాటు ఇప్పటికీ సినిమాకి సంబంధించి ఏలాంటి అప్డేట్స్ కూడా రాకపోవడంతో మొహం వాచేలా అభిమానులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

IHG'Baahubali 2: The Conclusion ...

దీంతో అభిమానులు ప్రభాస్ సినిమా చేసే విధానంపై సంతోషంగా లేనట్లు సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ లు జరుగుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమేగాక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే అత్యధిక మార్కెట్ కలిగిన ప్రభాస్ సినిమాలు స్లోగా చేయడం పై ఒక అభిమానులు మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ఇలా అయితే ప్రభాస్ కి ఉన్న క్రేజ్ దేనికి పనికి రాదని అన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: