నందమూరి బాలయ్య బాబు గత కొన్నాళ్ల నుండి సరైన విజయాన్ని టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అందుకోలేకపోయాడు. తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రకు సంబంధించి బయోపిక్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసి దారుణమైన అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవటం జరిగింది. ఆ తరువాత 'రూలర్' అనే సినిమా తీసి మరో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. దీంతో బాలయ్య బాబుకి వరుసగా ఫ్లాపులు పడటంతో నందమూరి అభిమానులు డిసప్పాయింట్ అయిపోయారు.

IHG

పరిస్థితులు ఇలా ఉండగా బోయపాటి బాలకృష్ణ తో సినిమా ప్రకటించగానే ఒక్కసారిగా నందమూరి అభిమానులలో ఆనందం నెలకొంది. గతంలో బోయపాటి ‘సింహ’ మరియు ‘లెజెండ్’ లాంటి రెండు సినిమాలు తెరకెక్కించి బాలకృష్ణకు అదిరిపోయే విజయాలు అందించారు. ఇలాంటి తరుణంలో బాలయ్య బాబు తో బోయపాటి మూడో సినిమా షూటింగ్ స్టార్ట్ అవడంతో సినిమా లో ఎవరు హీరోయిన్ అన్నది మొదటి నుండి సస్పెన్స్ గా మారింది.

IHG

ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ల పేర్లు మరియు అమలా పాల్ పేరు ఇంకా కొంతమంది పేర్లు సోషల్ మీడియా లో బోయపాటి సినిమాలో బాలయ్య సరసన నటిస్తున్నట్లు రూమర్లు పుట్టుకొచ్చాయి. దీంతో నందమూరిఫాన్స్ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇలాంటి తరుణంలో బోయపాటి బాలకృష్ణ సినిమాలో ఓ కొత్త అమ్మాయిని తీసుకున్నట్లు ఇటీవల ఓ మీడియా సంస్థకి చెప్పుకొచ్చారు. ఈ వార్త విని బాలయ్య ఫాన్స్ రిలీఫ్ అయ్యారు. మరోపక్క ఈ సినిమా తో కచ్చితంగా బాలయ్య బాబు కి మర్చిపోలేని విజయాన్ని అందించే హ్యాట్రిక్ విజయం సాధించాలని బోయపాటి మంచి పట్టుదలతో ఉన్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: