తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ దక్కించుకున్న రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్. నాలుగవ సీజన్ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కానుందట. తెలుగు టీవీలో ఎక్కువ టీఆర్పీ రేటింగ్స్ అందుకుని సక్సెస్ ఫుల్ గా అన్ అవుతున్న ఈ రియాలిటీ షో మొదటి సీజన్ కి వ్యాఖ్యాతగా ఎన్టీఆర్ చేసారు. ఆ తర్వాత రెండవ సీజన్ కి నేచురల్ స్టార్ నాని చేసారు. అయితే మూడవ సీజన్ కి అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా చేసిన సంగతి తెలిసిందే.

 

ఈ మూడు సీజన్లలోనూ మూడవ సీజన్ టాప్ రేటింగ్స్ దక్కించుకుంది. 14మంది కంటెస్టెంట్స్, రెండు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ తో వందరోజులకి పైగా టెలివిజన్ ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ సీజన్ విన్నర్ గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గెలిచాడు. రన్నరప్ గా బుల్లితెర యాంకర్ శ్రీముఖి మిగిలింది. అయితే మరికొద్ది రోజుల్లో నాలుగవ సీజన్ ప్రారంభం కాబోతున్న సమయంలో బిగ్ బాస్ గురించి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 

ఈ నాలుగవ సీజన్ లో బిత్తిరి సత్తి కంటెస్టేంట్ గా వస్తున్నాడని అన్నారు. ఇంకా శ్రధ్దా దాస్, హంసా నందిని, ప్రియా వడ్లమాని, యామినీ భాస్కర్ మొదలగు హీరోయిన్లు కంటెస్టెంట్లుగా వస్తున్నారని వినబడింది. అయితే నాలుగవ సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున బిగ్ బాస్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనేది ఆసక్తిగా మారింది. కరోనా కారణంగా పరిస్థితులు దారుణంగా తయారవడంతో ఈ సారి పారితోషికంలో ఎలాంటి మార్పు ఉండదని అంటున్నారు.

 

మూడవ సీజన్ కి ఎంత ఇచ్చారో నాలుగవ సీజన్ కి కూడా అంతే ఇవ్వనున్నారట. మరి మూడవ సీజన్ లాగే నాలుగవ సీజన్ సక్సెస్ ఫుల్ గా రవ్ అవుతుందేమో చూడాలి. అయితే ఈ సారి కరోనా కారణంగా బిగ్ బాస్ లో చాలా మార్పులు కనిపించనున్నాయట. 

మరింత సమాచారం తెలుసుకోండి: