అన్ని అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగి ఉంటే చిరంజీవి ‘ఆచార్య’ ఆగష్టు 15న కాని లేకుంటే అక్టోబర్ లో వచ్చే దసరా కు కాని విడుదలై ఉండేది. అయితే ఈసినిమాలో కొరటాల రామ్ చరణ్ కోసం కేటాయించిన ప్రత్యేక పాత్రకు మొదటి నుంచి కష్టాలు ఎదురౌతూనే ఉన్నాయి.


ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర దాదాపుగా 30 నుండి 40నిముషాల వరకు ఉండేలా కొరటాల ప్లాన్ చేసాడు. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్ పూర్తి అయితే కాని చరణ్మూవీ షూటింగ్ కు రాలేని పరిస్థితులు వల్ల ఏర్పడ్డ కన్ఫ్యూజన్ ఆతరువాత కరోనా సమస్యలతో షూటింగ్ లు వాయిదా పడటంతో ‘ఆచార్య’ కష్టాలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి.

 

వాస్తవానికి ఈ మూవీలో చరణ్ నటించే విషయమై ఇంకా పూర్తిగా రాజమౌళి అంగీకారం రాలేదు అన్న లీకులు కూడ ఉన్నాయి. దీనితో చరణ్ పాత్ర నిడివిని 30 నిమిషాల నుండి 15 నిముషాలకు తగ్గించి  చరణ్ చేయవలసిన పాత్రను కూడ చిరంజీవి చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికోసం ఈ మూవీ కధలో మళ్ళీ మార్పులు జరుగుతున్నట్లు టాక్.

 

ప్రస్తుత పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందో రాజమౌళికి కూడ తెలియని స్థితిలో ‘ఆర్ ఆర్ ఆర్’ పూర్తి అయ్యే వరకు వేచి చూడంటం కంటే ఈమధ్య మార్గం అనుసరించడం మంచిది అన్న నిర్ణయాని కి చిరంజీవి వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవిమూవీ పై తీసుకున్న తాజా నిర్ణయంతో ‘ఆచార్య’ షూటింగ్ అక్టోబర్ లో మొదలుపెట్టి వేగంగా పూర్తిచేసి ఈ మూవీ ప్రాజెక్ట్ ను జనవరికి పూర్తి చేసి వచ్చే ఎడాది మార్చ్ ఉగాదికి విడుదల చేయాలి అన్న కొత్త ఆక్షన్ ప్లాన్ లో కొరటాల ప్రస్తుతం బిజీగా ఉంటూ మంచి జోష్ లో ఉన్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: