ప్రస్తుత తరం ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోవడంతో టాప్ హీరోల సినిమాలలో విలన్ పాత్రను బాగా ఎలివేట్ చేస్తూ విలన్ ఎంత బలంగా ఉంటే హీరోయిజమ్ అంతబాగా ఎలివేట్ అవుతుంది అన్న అభిప్రాయంలో ఇప్పుడు టాప్ హీరోల సినిమాల నిర్మాణంలో మార్పు చేసుకుంటున్నాయి. దీనికితోడు హీరోలతో సమానంగా అందంగా ఉండే విలన్స్ ను ఇప్పుడు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.


ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఈకరోనా పరిస్థితులు ఎదిరిస్తూ త్వరలో సెట్స్ పైకి రావాలి అని ప్రయత్నాలు చేస్తున్న కొన్ని టాప్ హీరోల సినిమాలకు విలన్ పాత్రను ఎంపిక చేయడం చాలకష్టమైన పనిగా మారింది అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా చిరంజీవి త్వరలో నటించబోయే ‘లూసిఫర్’ మూవీ తెలుగు రీమేక్ లో ఆమూవీ కథ రీత్యా బలమైన విలన్ కోసం సుజిత్ అన్వేషణ సాగిస్తున్నట్లు టాక్.


వాస్తవానికి ఈపాత్రను జగపతి బాబు చేత చేయించాలని ఆలోచనలు వచ్చినా అంతకన్నా పవర్ ఫుల్ విలన్ మరెక్కడైనా దొరుకుతాడా అని ఆలోచనలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫైనల్ అయిన త్రివిక్రమ్ జూనియర్ మూవీలో విలన్ పాత్ర చాలకీలకం కావడంతో ఆపాత్రను ఎవరైనా ఒక యంగ్ హీరో చేత నటింప చేస్తే బాగుంటుంది అన్నఆలోచనలలో త్రివిక్రమ్ ఉన్నాడు.


మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ కథ ఫైనల్ అయినా ఈమూవీలోని విలన్ పాత్ర కోసం ఉపేంద్ర సుదీప్ అరవింద్ స్వామిల మధ్య ఎవరు బెస్ట్ అన్న ఆలోచనలు కొనసాగుతున్నాయి. ఇక ‘పుష్ప’ సినిమా విషయంలో కూడ ఈ విలన్ కష్టాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి మొదట్లో విజయ్ సేతుపతి పేరు వినిపించినా ఆతరువాత సునీల్ శెట్టి వైపు సుకుమార్ ఆలోచనలు కొనసాగాయి. అయితే సునీల్ శెట్టి భారీ పారితోషికం అడగడంతో మళ్ళీ ‘పుష్ప’ కు విలన్ వేట మొదలైంది. ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తీయబోతున్న 400 కోట్ల పాన్ ఇండియా భారీ మూవీకి ఆమూవీ స్థాయికి తగ్గట్టుగా విలన్ పాత్ర ఎంపిక చేయడం ప్రస్తుతం సమస్యగా మారింది అని అంటున్నారు. దీనితో ఈ కరోనా సమస్యల మధ్య టాప్ హీరోల సినిమాలకు బిజినెస్ ను ఎలా నిలబెట్టాలి అన్నసమస్యలతో పాటు హీరోలను ఎలివేట్ చేసే విలన్ వేటలో ఇప్పుడు టాప్ దర్శకులు అంతా అనేక మార్గాలను అన్వేషిస్తూ చాలబిజీగా ఉంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: