నేషనల్ స్టార్ ప్రభాస్ 20వ చిత్ర అప్డేట్స్ గురించి ఎన్నో రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ సంవత్సరం దాటిపోవస్తున్నా కూడా ఇప్పటి వరకూ ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ప్రభాస్ అభిమానులు యూవీ క్రియేషన్స్ కి వ్యతిరేకంగా తమ అసహనాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు.

 

 

అయితే అభిమానుల కోరిక తీర్చడానికి యూవీ క్రియేషన్స్ ముందుకు వచ్చింది. ఈ నెల పదవ తేదీన ప్రభాస్ 20వ చిత్రం నుండి అప్డేట్ ఇవ్వనున్నారని నిన్న ప్రకటించారు. అయితే ఈ వార్తతో ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. సాహో తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చూపించడానికి అభిమానులు రెడీ అయిపోయారు.

IHG's first look to release on July 10 | Entertainment <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NEWS' target='_blank' title='news-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>news</a>,The  <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIAN' target='_blank' title='indian-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>indian</a> Express

 

సోషల్ మీడియాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ని ట్రెండ్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. అయితే అభిమానులకి పదవ తేదీన రెండు టాస్కులు వచ్చి పడ్డాయి. ప్రభాస్ ని నేషనల్ స్టార్ ని చేసిన బాహుబలి ది బిగినింగ్ చిత్రం జులై 10వ తేదీనే రిలీజైంది. అందువల్ల బాహుబలి ఐదు సంవత్సరాల యానివర్సరీని కూడా ట్రెండ్ చేయాల్సిన పని ఏర్పడింది. అంటే రేపు ప్రభాస్ అభిమానులకి రెండు పనులు ఉన్నాయన్న మాట.

 

IHG'Bahubali: The Beginning'  to be screened at Royal Albert Hall on THIS date

మరి ఈ రెండింటినీ ట్రెండింగ్ లో ఉంచడంలో ప్రభాస్ అభిమానులు సక్సెస్ అవుతారో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: