సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత మానసిక ఆరోగ్యం అనేది ప్రధానంగా చర్చకు వస్తోంది. ముఖ్యంగా గ్లామర్‌ ఫీల్డ్‌లో ఉంటున్న వాళ్లకు డిప్రెషన్ తీవ్రస్థాయిలో ఉంటుందని, ఆ కారణంగానే ఆ రంగంలో ఆత్మహత్యలు తరుచూ తెర మీదకు వస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ ఒత్తిడిని జయించేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గం చూపిస్తున్నారు.

 

తాజాగా సాహో బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కూడా డిప్రెషన్‌ను జయించేందుకు తన వంతుగా టిప్స్‌ ఇస్తోంది. బుధవారం తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసిన జాక్వెలిన్‌ యోగా ద్వారా డిప్రెషన్‌ను జయించ వచ్చని చెప్పింది. రకరకాల యోగాసనాలు చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన జాక్వెలిన్‌ అభిమానులను మోటివేట్‌ చేస్తోంది.

 

తన వీడియోలో ఎంతో కఠినమైన యోగాసనాలు ప్రదర్శించి చూపించింది జాక్వెలిన్‌, బ్లాక్‌ కలర్‌ యోగా పాంట్‌ తో పాట్‌ పింక్‌, గ్రే కాంబినేషన్‌లో స్పోర్ట్స్‌ బ్రాలో జాక్వెలిన్‌ సెక్సీగా కనిపిస్తోంది. ఈ వీడియోతో పాటు నేను కొద్ది రోజులుగా తీవ్ర మైన ఒత్తిడిని డీల్ చేస్తున్నాను. ఈ సమయంలో యోగా నాకు ఎంతో ఉపయోగపడింది. అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: