ప్రస్తుతం షూటింగ్ లు లేక ఖాళీగా ఉంటున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక తెలంగాణ ఫిలిం మేకర్స్ ను ఆంధ్రాప్రాంత ఫిలిం మేకర్స్ చిన్నచూపు చూస్తున్నారు అంటూ ప్రచురించిన ఒక షాకింగ్ కథనం ఇండస్ట్రీ వర్గాలను ఉలిక్కిపాటుకు గురిచేసింది. తెలంగాణ టాలెంట్ ను ఇప్పటికీ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పూర్తిగా గుర్తించడం లేదని అదేవిధంగా తెలంగాణ ప్రాంత కథలతో వచ్చిన సినిమాలకు ఆంధ్ర ప్రాంతంలో ఆదరణ కూడ బాగా తక్కువ అంటూ కొందరు ప్రముఖ తెలంగాణ సినిమా రంగానికి చెందిన దర్శకులు నిర్మాతల అభిప్రాయాలను ఈ కథనంలో ప్రముఖంగా పేర్కొనడం జరిగింది.


ముఖ్యంగా గత సంవత్సరం విడుదలైన ‘జార్జిరెడ్డి’ మూవీ దర్శకుడు jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి ఈవిషమై మాట్లాడుతూ తన మూవీకి బాలీవుడ్ ప్రముఖుల నుండి ప్రశంసలు వచ్చాయి కాని టాలీవుడ్ టాప్ దర్శకులు ఎవరు కనీసం తన సినిమాను ప్రశంసిస్తూ ఒక ట్విట్ కూడ చేయలేదు అన్న అభిప్రాయం వ్యక్తపరిచాడు. అంతేకాదు ఆంధ్రా ప్రాంత దర్శకులు ఒక వ్యక్తిలోని టాలెంట్ ను గుర్తించకుండా ఆ దర్శకుడు గతంలో ఎన్ని భారీ చిత్రాలు తీసాడు అన్న విషయం పై ఒక దర్శకుడుకి గౌరవం ఇస్తూ ఉంటారు అని అభిప్రాయ పడ్డాడు.


ఇక ‘దొరసాని’ సినిమాను తీసిన కేవిఆర్ మహేంద్ర కూడ తెలంగాణ నేపధ్యంలో ఉండే కథలు సినిమాలుగా తీస్తే ఆంద్ర ప్రాంత మీడియా కనీసం తన సినిమాకు మంచి రేటింగ్స్ కూడ ఇవ్వలేదు అని అభిప్రాయపడుతున్నాడు. ముఖ్యంగా నిర్మాత రాజ్ కందుకూరి అభిప్రాయం ప్రకారం తెలంగాణ సినిమా ఆంద్రా ప్రాంత సినిమా ధాటీకి తట్టుకుని నిలబడాలి అంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కథలతో తీసే సినిమాలకు ప్రోత్సహాకాలు సబ్సిడీలు ఇవ్వకపోతే భవిష్యత్ లో తెలంగాణ ప్రాంత సినిమా బ్రతికి బయటపడటం కష్టం అని అభిప్రాయపడుతున్నాడు.


ఆఖరికి ప్రస్తుత కరోనా కాలంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు షూటింగ్ లు లేక బాధపడుతున్న ఇండస్ట్రీ వర్కర్స్ కు చేసిన సహాయంలో కూడ తెలంగాణ ప్రాంత ఫిలిం వర్కర్స్ కు అన్యాయం జరిగింది అంటూ ఆ పత్రిక కథనం పెర్కుంది. అయితే ప్రస్తుతం ఆంధ్రా ప్రాంతంలోని యూత్ కు ఐకాన్ గా కొనసాగుతున్న క్రేజీ విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రాంత వ్యక్తి పూర్తిగా తెలంగాణ యాస తో సాయి పల్లవి చేత ‘ఫిదా’ సినిమాలో శేఖర్ కమ్ముల డైలాగ్స్ చెప్పిస్తే ఆ డైలాగ్స్ ను విపరీతంగా ఆస్వాదించింది ఆంధ్రా ప్రాంత ప్రేక్షకులు అన్న వాస్తవ విషయాలను ఆ ప్రముఖ దినపత్రిక ఎందుకు గుర్తించ లేదు అన్నది సమాధానం లేని ప్రశ్న..

 

మరింత సమాచారం తెలుసుకోండి: