టక్కరి దొంగ సినిమాలో హీరో క్యారక్టరైజేషన్ వివరిస్తూ ఇంట్రొ సాంగ్ ఉంటుంది. మహేష్, జయంత్ పరాంజి కాంబోలో వచ్చిన ఆ సినిమాలో నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో.. నలురెవరు నడవనిదే ఆ రూట్లో నే నడిచెదరో.. ఆ సాంగ్ గుర్తింది కదా అచ్చం ఈ సాంగ్ లానే బయట ఓ మనిషి ఉన్నాడు అందరికి తెలిసినవాడే ఆయనే ఆర్జివి. టాలెంట్ తో పాటుగా అన్ని ఎక్కువే ఉన్న ఆయనకు ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేసేస్తాడు. ముందు వెనుక చూసుకోవడం.. ముహుర్తాలు గట్రా పెట్టుకోవడం లాంటివి అసలు ఉండవు. 

 

ఈ లాక్ డౌన్ టైంలో వరుస సినిమాలు చేస్తూ మరింత రెచ్చిపోతున్న ఆర్జివి ఈమధ్యనే మరో రెండు కొత్త సినిమాలు ఎనౌన్స్ చేశాడు. ఆల్రెడీ క్లైమాక్స్, నగ్నం సినిమాలు రిలీజవగా.. కొత్తగా పవర్ స్టార్, 12'ఒ క్లాక్ సినిమాలు ఎనౌన్స్ చేశాడు. అయితే పవర్ స్టార్ టైటిల్ తో వర్మ చేస్తున్న సినిమా పవన్ కళ్యాణ్ గురించే అని తెలిసి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేశారు. ఈ గ్యాప్ లో కొద్దిగా వెనక్కి తగ్గినట్టు కనిపించిన ఆర్జివి లేటెస్ట్ గా సినిమా పోస్టర్ తోనే షాక్ ఇచ్చాడు.

 

పవర్ స్టార్ అంటూ ఆర్జివి సినిమా రాబోతుంది. టైటిల్ పోస్టర్ లో పవర్ కు స్టార్ కు మధ్యలో జనసేన గ్లాస్ గుర్తు ఉంది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ఈరోజు రిలీజ్ చేస్తాడట వర్మ. పవర్ స్టార్ ఫ్యాన్స్ తాకిడితో ఆయన సినిమా వదులుకుంటాడని పవన్ ఫ్యాన్స్ కు ఈ పోస్టర్ తో షాక్ ఇచ్చాడు. అయినా అదరిలా వెనక్కి తగ్గితే ఆయన ఆర్జివి ఎందుకవుతాడు చెప్పండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు.            

మరింత సమాచారం తెలుసుకోండి: