మన తెలుగు లో కొన్ని  కొంత మంది నటుల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. అందులో రావు గోపాల రావు ఒకరు. ఆయన ఏ సినిమాలో అయినా సరే ఏ పాత్ర అయినా సరే ఆ పాత్రకు అన్ని విధాలుగా న్యాయం అనేది చేస్తూ ఉంటారు. ఏ పాత్రలో ఆయన ఉన్నా సరే ఆ పాత్రకు ఒక రేంజ్ అనేది వస్తుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే ఆయన చేస్తే ఆ సినిమా రేంజ్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఆయన సినిమాల కోసం చాలా వరకు కూడా ఎదురు చూసే వారు అప్పటి  ఫాన్స్. 

 

ఇక ఆయన పోషించిన కొన్ని కొన్ని పాత్రలు ఆయనకు చాలా మంచి గుర్తింపు అనేది తెచ్చాయి అనే సంగతి తెలిసిందే. హీరోలకు హీరోయిన్స్ కి ఆయన తండ్రి గా చాలా వరకు నటించారు. అందులో ఆయన విలన్ గా కూడా చేసారు. విలన్ పాత్ర అయినా సరే మరో పాత్ర అయినా సరే ఆ పాత్ర ఆయన చేస్తే ఇక అది హిట్. ఆయన నోటి నుంచి వచ్చే మాట అయినా ఆయన నోటి నుంచి వచ్చే డైలాగ్ అయినా సరే అది సూపర్ హిట్ కావడమే. ఇప్పుడు ఆయన లేకపోయినా సరే ఆయన సినిమాలు మాత్రం జనాలకు అలా గుర్తున్నాయి. 

 

ఆయన చేసిన పాత్రలను ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆయన ఫాన్స్. అప్పటి ప్రేక్షకులకు ఆయన అంటే ఒక పిచ్చి. హీరో తండ్రి పాత్రలకంటే కూడా హీరోయిన్ తండ్రి పాత్రలను ఆయన చాలా సమర్ధవంతంగా చేసారు అనే చెప్పాలి. ఇప్పుడు ఆయన కుమారుడు కూడా తన వంతుగా నటిస్తున్నారు ఏ పాత్ర అయినా సరే.

మరింత సమాచారం తెలుసుకోండి: