టాలీవుడ్ లో ఒక్కడు సినిమా ఒక సంచలనం అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో ఒక సూపర్ హిట్.  మహేష్ బాబు ని స్టార్ హీరో ని చేసిన సినిమా ఇదే అని చెప్పాలి. ఈ సినిమాలో ఆయన నటన కు చాలా మంచి మార్కులు పడ్డాయి. ఇక విలన్ గా ప్రకాష్ రాజ్ కూడా చాలా అందంగా నటించి మెప్పించారు. వరుసగా అక్కడి నుంచి మహేష్ బాబు కి ఆఫర్లు వచ్చాయి. అప్పటి వరకు మహేష్ తో సినిమా చేయడానికి ఒకటికి పది సార్లు ఆలోచించిన స్టార్ దర్శక నిర్మాతలు అక్కడి నుంచి ఆయనకు తమ సినిమాల్లో వరుస ఆఫర్లు ఇవ్వడానికి ముందు కు వచ్చారు. 

 

ఇప్పుడు మహేష్ అంటే ఒక రేంజ్ లో జనాలకు పిచ్చి ఉంది అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు కి ఒక్కడు సినిమాలో ముఖేష్ రుషి తండ్రి గా నటించారు. ఆ సినిమాలో ఆ పాత్ర చాలా బాగా హిట్ అయింది. ఆ ఆసినిమాలో ఆయన పోలీస్ అధికారిగా నటించారు. అలాగే మహేష్ కి తండ్రి గా కూడా చేసారు. అప్పటి వరకు ఆయన విలన్ పాత్రలు చేస్తూ వచ్చే వారు. కాని అక్కడి నుంచి ఏ పాత్ర అయినా సరే చేస్తారు అనే పేరు ఆయనకు వచ్చింది. వరుస ఆఫర్లు వచ్చాయి స్టార్ హీరోల సినిమాల్లో. ఆయన పాత్రలకు మంచి డిమాండ్ అనేది ఉంది అక్కడి నుంచి. 

 

మహేష్ లాంటి స్టార్ హీరో కి కూడా ఆయన చాలా అందంగా నటించారు అనేది వాస్తవం. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు ప్రస్తుతం ఒక సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది అని టాక్ మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: