మన తెలుగు లో ముఖేష్ ఋషీ అనగానే విలన్ అనే మాట చాలా మందికి స్పష్టంగా కళ్ళ ముందు ఉంటుంది. ఆయన ఏ సినిమా చేసినా సరే చాలా మంది ఆయనను ఇప్పటికి కూడా ఒక  విలన్ గానే చూస్తూ ఉంటారు. ఆయన సినిమాలు ఏది ఎలా ఉన్నా సరే ఆయన మాత్రం చాలా వరకు తన పాత్రకు న్యాయం చేస్తూ ఉంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన లో ఆయన దాదాపుగా జీవిస్తూ ఉంటారు. ఇక విలన్ పాత్రల విషయంలో ఆయనను మించిన వారు లేరు. రాయలసీమకు చెందిన ఫ్యాక్షన్ చేసే వారు కూడా ఆయనను చూసి అసూయ పడ్డారు. 

 

ఆ రేంజ్ లో ఆయన నటించారు అనేది వాస్తవం. ఇక అది అలా ఉంటే ఇప్పుడు అయన గురించి ఒక విషయం ఏంటీ అంటే... ఆయన బృందావన౦ సినిమాలో ఎన్టీఆర్ కి తండ్రి గా నటించారు. ఆ పాత్రలో అయన చాలా అందంగా జీవించారు అనే మాట వాస్తవం.  ఆ సినిమాలో ఆయన నటనకు చాల ఆమంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా కూడా చాలా బాగా హిట్ అయింది అని చెప్పవచ్చు. ఆ సినిమాలో ఆయన తో పాటుగా ప్రగతి కూడా చాలా బగా నటించి మెప్పించారు అనేది వాస్తవం. ఇక ఇప్పుడు కూడా ఆయనకు మంచి ఆఫర్లు వరుసగా వస్తూనే ఉన్నాయి. 

 

టాలీవుడ్ లో ఆయనకు ఇంకా కొన్ని కొన్ని పాత్రలు సంబంధించిన డిమాండ్ అనేది అదే విధంగా ఉంది అని చెప్పాలి. వచ్చే రెండు మూడేళ్ళు కూడా ఆయన బిజీ గానే ఉన్నారు. దాదాపు తెలుగు తమిళ భాషల్లో ఆయన ఆరు సినిమాల వరకు చేస్తున్నారు అని టాక్ మరి. ఎన్ని సినిమాలు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: